రెండు రోజులుగా వెతుకుతున్నా.. ఎందుకిలా చేశావు తల్లీ..!

26 Jun, 2021 08:11 IST|Sakshi
భువన ( ఇన్‌సెట్‌లో ) రాజేశ్వరి (ఫైల్‌)

లావేరు: మండలంలోని కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనేల రాజేశ్వరి(29) అనే గర్భి ణి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదానికి కారణం భర్త, అత్తమామల వేధింపులేనని మృతురాలి సోద రుడు గన్నెయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి సోదరుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనేల కోటేశ్వరరావుతో పొందూరు మండలం బురిడికంచరాం గ్రామానికి చెందిన రాజేశ్వరికి మూడేళ్ల కిందట వివాహమైంది. రాజేశ్వరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో మేన మామలు గండి ఆనంద్, మహేష్‌లు పెంచి పెద్దచేశారు. వివాహ సమయంలో కొంత కట్నకానుకలు ఇచ్చారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాత కోటేశ్వరరావు నిత్యం మద్యం సేవించి వచ్చి రాజేశ్వరిని హింసించేవాడు.

అత్తమామలు శ్రీనివాసులమ్మ, రాములు సైతం అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారు. ఈ విషయాన్ని రాజేశ్వరి పలుమార్లు మేనమామలకు, సోదరుడు గన్నెయ్యకు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 23న భర్త, అత్తమామ లు అదనపు కట్నం తేవాలని మరోసారి వేధించడంతో రాజేశ్వరి తన రెండేళ్లు కుమార్తె భువనను తీసుకొ ని లావేరు మండలం చినమురపాక సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న నేలబావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం చినమురపాకకు చెందిన కొందరు నేలబావి వద్దకు వెళ్లగా బావిలో మహిళ, పాప మృతదేహాలు తేలడంతో లావేరు పోలీసులకు సమాచారం అందించారు.

మృతుల వివరాలు తెలియడంతో వెంటనే స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజేష్, పోలీసులు, చినమురపాక, కేశవరాయునిపాలెం వీఆర్‌వోలు డి.స్వామినాయు డు, ఎం.రమేష్‌లు బావి వద్దకు వచ్చి మృతదేహాల ను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మృతురా లి సోదరుడు గన్నెయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి కేశవరాయునిపాలెంలో వలంటీరుగా సేవలందించింది.

రెండు రోజులుగా వెతుకుతున్నా.. 
రాజేశ్వరి కేశవరాయునిపాలెం నుంచి ఈ నెల 23న వెళ్లిపోయిన విషయాన్ని గ్రామస్తులు ఆమె సోదరు డు గన్నెయ్య, మేనమామలకు ఫోన్‌ ద్వారా తెలియ జేశారు. అప్పటి నుంచి వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలసతో పాటు పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. పాపతో కలిసి రాజేశ్వరి ఆత్మహ త్య చేసుకుందన్న సమాచారం తెలియజేయడంతో సోదరుడు, మేనమామలు కన్నీరుమున్నీరుగా విల పించారు. ఇద్దరి మృతికి కారణమైన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 
చదవండి: ఐటీడీఏ మాజీ పీవో సూర్యనారాయణ అరెస్టు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు