తెలిసిన వారే కదా అని వెళ్తే ఎంత పనిచేశారు..

4 Jun, 2021 20:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్​: మహిళలపై జరుగుతున్న హింసలను, అత్యాచారాలను నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకోచ్చిన కొంత మంది దుర్మార్గులలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ, ప్రతి రోజు మహిళల పట్ల హింసలు, లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్థాన్​లోని ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు, జైపూర్​ జిల్లా లోని ప్రతాప్​నగర్​ ప్రాంతంలోని  లునియవాస్​ అనే అపార్ట్​మెంట్​లో  ఇద్దరు యువతులు నివసిస్తున్నారు. వారిద్దరు 19,20 సంవత్సరాల వయస్సున్న అక్క చెల్లెళ్లు. అయితే, నిందితులలో ఇద్దరు యువకులు ఆ బాలికలకు ఇదివరకే తెలుసు. ఈ క్రమంలో జూన్​1 న బాలికలు ఉంటున్న ఇంటికి వచ్చి, తమతో పాటు బయటకు రావాలని కోరారు. తెలిసిన వారే కదా అని అక్కచెల్లెళ్లిద్దరు వెళ్లారు. వారంతా సమీపంలోని ఒక ఇంట్లో చేరుకున్నారు.

కాసేపటికి, వారితో పాటు గుర్తు తెలియని మరో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత, వారు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా, వారిని బంధించి తీవ్రంగా కొట్టి,  నలుగురు యువకులు కలసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైన చెబితే చంపేస్తామని కూడా బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ బాలికలు ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి చేరుకున్న బాలకలు భయపడుతూ.. జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వెంటనే ప్రతాప్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన అటల్​, పంకజ్​లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు బాధిత బాలికలను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. తోందరలోనే మరో ఇద్దరిని పట్టుకొని నిందితులపై కఠిన చట్టాల కింద కేసులను నమోదు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు