గుంటూరులో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

24 Apr, 2021 07:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద శనివారం ఉదయం కూలీల ఆటోను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 


చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల అరెస్ట్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు