నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌

1 Aug, 2022 13:35 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను డీసీపీ మేరీ ప్రశాంతి మీడియాకు వివరించారు. విజయవాడ కేంద్రంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి కస్టమర్లపై వేధింపులకు దిగుతున్నారన్నారు.
చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్‌

హరిత కుటుంబ సభ్యులను అవమానించామని నిందితులు ఒప్పుకున్నారు. బేగంపేట్‌ కేంద్రంగా ఎస్‌ఎల్‌వీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఎవరైనా కస్టమర్లను వేధిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. విద్యార్థి హరితను దూషించి మాట్లాడటం వలనే ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.

మరిన్ని వార్తలు