స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు

24 Dec, 2020 12:29 IST|Sakshi

స్నేహలత హత్యపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

సాక్షి, అనంతపురం : దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మృతదేహానికి నివాళులు అర్పించిన వాసిరెడ్డి పద్మ... బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వైద్య విద్యార్థిని రిసితేశ్వరి చనిపోతే కేసు కూడా నమోదు చేయని చరిత్ర చంద్రబాబు నాయుడిది. అలాంటిది స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు చేస్తోంది. హత్య ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాం. చదవండి: స్నేహలత హత్య కేసు: కార్తీక్‌ అరెస్ట్‌

దిశ చట్టం ద్వారా వారం రోజుల్లో ఛార్జ్‌షీట్‌ దాఖలు అవుతుంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ...స్నేహలత హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం, మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరోవైపు ఈకేసులో నిందితులు ఉన్న రాజేష్‌, కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు