అమ్మవారి తాళిబొట్టు చోరీ.. తప్పు తెలుసుకున్న దొంగలు!

4 May, 2022 11:59 IST|Sakshi

మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్లిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగ అక్కడ పెట్టి వెళ్లిన వైనం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని ఉప్పినహళ్ళి గ్రామంలో ఉన్న దుర్గాంబ అమ్మవారి దేవాలయంలొ చోటు చేసుకుంది. గతనెల 24న గ్రామంలోని దుర్గాంబ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. అంతలోనే తప్పు తెలుసుకుని దొంగలు భక్తుల తరహాలో గుడికి వచ్చి దొంగిలించిన నగ, కొంత నగదు కానుకగా పెట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.   

(చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..)

మరిన్ని వార్తలు