బీబీఏ గ్రాడ్యుయేట్‌ డ్రగ్స్‌ దందా

12 Nov, 2021 01:05 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న అంజనీకుమార్‌ 

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు..

డార్క్‌నెట్‌ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు 

యాప్‌ల ద్వారా ఆర్డర్లు.. డెలివరీ 

కస్టమర్లలో ఇంజనీరింగ్‌ విద్యార్థులే అధికం

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు, యువతనే టార్గెట్‌గా చేసుకుని ఎండీఎంఏ (మిథలీన్‌ డైఆక్సీ మిథాంఫిటమిన్‌) డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాగుట్టును నగర పోలీసులు బట్టబయలు చేశారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో ఆసిఫ్‌నగర్‌ పోలీసులు వలపన్ని సూత్రధారి రాచర్ల అంకిత్‌తోపాటు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పశ్చిమ మండల జేసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతితో కలిసి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం మీడియాకు వెల్లడించారు.

అమీర్‌పేటకు చెందిన అంకిత్‌ (బీబీఏ పూర్తి చేశాడు) ఏడాది కాలంగా గోవా నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ తెప్పిస్తున్నాడు. డార్క్‌నెట్‌తోపాటు వీకర్‌ అనే యాప్‌ ద్వారా ఆర్డర్లు ఇచ్చి ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తాడు. రెండు మూడు రోజులకు గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకుని ఓ వ్యక్తి నగరానికి వస్తాడు. అతడు చెప్పిన చోటుకు వెళ్లి అంకిత్‌ దాన్ని తీసుకుంటాడు. ఈ మాదకద్రవ్యాన్ని విక్రయించడానికి ఇతడు మరో ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు.

హయత్‌నగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన ధరావత్‌ సాయి చరణ్‌ (బీటెక్‌ గ్రాడ్యుయేట్‌), బీహెచ్‌ఈఎల్‌కు చెందిన బెల్లె అజయ్‌ సాయి (బీటెక్‌ విద్యార్థి) ఈ పని చేస్తున్నారు. సోషల్‌మీడియా యాప్స్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నారు. గోవాలో ఒక్కో ఎండీఎంఏ టాబ్లెట్‌ను అంకిత్‌ రూ.1,500కు ఖరీదు చేసి, రూ.2,500కు విక్రయిస్తున్నాడు. వీరి కస్టమర్లలో ఇంజినీరింగ్‌ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఎండీఎంఏను ఎక్స్‌టసీ, మోలీ అని కూడా పిలుస్తారు.

ఈ వ్యవహారంపై ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందింది. గురువారం మెహదీపట్నం బస్టాప్‌ వద్ద వలపన్నిన అధికారులకు అజయ్, అంకిత్‌ చిక్కారు. వీరి నుంచి 50 ఎక్స్‌టసీ పిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సాయి చరణ్‌ పేరు వెలుగులోకి రావడంతో అతడినీ అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరో 60 పిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు.

పాకెట్‌ మనీ లెక్కలు అడగండి
ఈ ముఠా వద్ద ఎండీఎంఏ పిల్స్‌ ఖరీదు చేస్తున్న వారిలో విద్యార్థి దశలోని యువతే ఎక్కువ. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్‌ మనీతో వీళ్లు డ్రగ్స్‌ కొంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఇచ్చే పాకెట్‌ మనీ ఖర్చుల లెక్కలు అడగాలి. వారి కార్యకలాపాలు, వ్యవహారశైలిని నిత్యం గమ నించాలి.
– అంజనీకుమార్, కమిషనర్‌

కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం
ఈ గ్యాంగ్‌ ఎక్కువగా కాలేజీల వద్ద విక్రయిస్తున్నట్లు గుర్తించాం. మాదకద్రవ్యాలు కొంటున్న వారి లో ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఎ క్కువగా ఉన్నారు. కొందరిని గు ర్తించాం. వీరిని బాధితులుగా ప రిగణిస్తూ తల్లిదండ్రులతోసహా పి లుస్తున్నాం. డ్రగ్స్‌ ప్రభావంపై కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. 
– ఏఆర్‌ శ్రీనివాస్, జేసీప

మరిన్ని వార్తలు