అమలాపురం అల్లర్లలో మరో ఇద్దరి అరెస్ట్‌

9 Jun, 2022 05:48 IST|Sakshi

ఇప్పటివరకు అరెస్టయినవారి సంఖ్య 137 

అమలాపురం టౌన్‌: అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కె.ఎస్‌.ఎస్‌.వి.సుబ్బారెడ్డి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ముమ్మిడివరం గొల్లవీధికి చెందిన మట్ట లోవరాజు, అమలాపురం కల్వకొలను వీధికి చెందన గోకరకొండ సూరిబాబులను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కలిపి అమలాపురం విధ్వంసకర  ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 137 మందిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. ఈ కేసుల్లో మరికొందరిని అరెస్ట్‌ చేయనున్నట్లు తెలిపారు. 

ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారంపై కేసు నమోదు
అమలాపురంలో జరిగిన అల్లర్లపై ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన పశ్చిమ గోదావరి జి ల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన చేగొండి నానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. నానిని బుధవారం అరెస్ట్‌ చేసి కో ర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

ఫేస్‌బు క్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ గ్రూపుల్లో ఒక వర్గాన్నిగానీ, వ్యక్తులనుగానీ రెచ్చగొట్టేలా పోస్టింగ్‌లు పెడితే  కఠిన చర్యలు ఉంటా యని హెచ్చరించారు. ఎక్కడైనా జరిగిన ఘటనలకు అసత్యాలు జోడించి పోస్టింగ్‌ పెట్టినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు