హవాలా హబ్‌గా బెజవాడ

10 Sep, 2020 08:33 IST|Sakshi
విజయవాడలో మంగళవారం పట్టుకున్న నగదు

జోరుగా జీరో వ్యాపారం 

నిత్యం వివిధ మార్గాల్లో దందా

చేతులు మారుతున్న రూ.కోట్ల నల్లధనం 

నగర పోలీసుల చర్యలతో వెలుగులోకి

ఇవేవీ పట్టని జీఎస్టీ, ఆదాయపన్ను శాఖలు

కేసులు నమోదయ్యాక తీరిగ్గా రంగంలోకి 

అడపాదడపా జీరో మాల్‌ను పట్టుకుంటున్న టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు 

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ హవాలా ముఠాలకు హబ్‌గా మారింది. హవాలా, జీరో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. వస్తు, ధన రూపంలో రూ.కోట్లలో లావాదేవీలు చప్పడులేకుండా చేస్తున్నారు. ఇదంతా జీఎస్టీ అధికారులకు, ఆదాయపన్ను శాఖాధికారులకు, పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలున్నాయి. అందుకు మామూళ్లే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

రూ.కోట్లలో వ్యాపారం  
వాణిజ్య నగరం విజయవాడ. ఈ నగరంలో బంగారం, వస్త్ర, చెప్పులు తదితర వ్యాపారాలకు ప్రసిద్ధి. మరీ ముఖ్యంగా బంగారం కొన్ని కుటుంబాలు రోజూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తుంటారని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇంచుమించు ఇదే తరహాలో వస్త్ర, చెప్పుల వ్యాపారం. వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వివిధ నగరాల నుంచి దుకాణాలకు తెప్పించుకునే సరుకులో సగానికి మాత్రమే బిల్లులు చూపుతూ.. మిగిలిన సగం సరుకు జీరో కింద ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారులకు ఇచ్చే డబ్బును హవాలా(హుండీ) మార్గం ద్వారా యథేచ్ఛగా చెల్లింపులు చేస్తున్నారు.  పశి్చమగోదావరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న హవాలా డబ్బుపై మంగళవారం ఆకాశరామన్నలు పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతోనే వెలుగులోకి వచ్చింది.   

అడపాదడపా కేసులు..  
జీరో, హవాలా వ్యాపారాలపై అడపాదడపా ఆకాశరామన్నలు అందిస్తున్న సమాచారంతో టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఈ ముఠాలను పట్టుకుంటున్నారు. వారికి అధికారాలు పరిమితంగానే ఉండటంతో సంబంధిత శాఖలకు ఈ కేసులను అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారు.  
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలోని కొత్తపేట పరిధిలోని గణపతి రోడ్డులో ఈ కేఆర్‌ ఫ్యాషన్‌ వరల్డ్‌ షాపు రాజస్థాన్‌కు చెందిన జగదీష్‌ వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతడు హవాలా మార్గం ద్వారా ఇతరులకు పంపాల్సిన రూ.35 లక్షలు తన షాపులో లెక్కిస్తుండగా కొత్తపేట పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇచ్చారు.  
అదే నెలలో విజయవాడలోని వన్‌టౌన్‌ పరిధిలో జీరో వ్యాపారం కోసం ఈ నెల 12న ముంబాయి నుంచి మరుదూరు కొరియర్‌ సరీ్వస్‌కు వచ్చిన రూ.17.37 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను టాస్‌్కఫోర్స్‌ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. వాటికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు.  
మే నెలలో ఢిల్లీ నుంచి విజయవాడ నగరానికి ట్రక్‌లో తరలిస్తున్న రూ.2.99 కోట్ల విలువైన నిషేధిత సిగరెట్లను రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌(డీఆర్‌ఐ) అధికారులు విజయవాడ గ్రామీణ పరిధిలోని పి.నైనవరంలో పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం రాష్ట్ర జీఎస్‌టీ అధికారులకు అప్పగించారు.     

మరిన్ని వార్తలు