ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..

4 Dec, 2020 06:56 IST|Sakshi
ప్రియుడు మధునాయక్‌తో శిల్ప (ఇన్‌సెట్‌) ప్రదీప్‌

మండ్య జిల్లాలో ఘోరం  

సాక్షి, కర్ణాటక (మండ్య): ప్రేమపెళ్లి చేసుకుని కొడుకుతో అన్యోన్యంగా ఉన్న ఒక కుటుంబంలో ప్రియుడు చిచ్చుపెట్టాడు. అతని మోజులో పడి భార్య కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. ఈ ఘోరం మండ్య తాలూకాలోని హనకెరెలో ఆలస్యంగా వెలుగు చూసింది.  మండ్య గ్రామీణ పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ప్రదీప్‌ (35), భార్య శిల్ప (30) 13 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లాడారు. వారికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలో మూడేళ్ల కిందట మధు నాయక్‌ (34) అనే వ్యక్తి శిల్పకు పరిచయమయ్యాడు. ఇతను కేఆర్‌ నగరవాసి. స్వయం సేవా సంఘాల వారికి రుణాలను ఇప్పించడం వంటి దళారీ పనులు చేసేవాడు. శిల్ప, మధుల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. శిల్ప భర్త ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికే వచ్చివెళ్లేవాడు. బయట షికార్లు సరేసరి. ఇది తెలిసి ప్రదీప్‌ భార్యను తీవ్రంగా మందలించగా ఎన్నోసార్లు గొడవలూ జరిగాయి.  చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...)

బంధువులకు అనుమానం ఇలా   
తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రేయసీప్రియులు పథకం వేశారు. నవంబర్‌ 18వ తేదీన రాత్రి గుట్టుగా భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారుకున్న భర్తను ప్రియునితో కలిసి గొంతు నులిమి చంపింది. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడని శిల్ప ఉత్తుత్తి ఏడుపు ఏడ్చి అనుమానం రాకుండా అంత్యక్రియలు జరిపించింది. అప్పటినుంచి ప్రియుడు మధుతో జల్సాలు చేస్తుండడం చూసి ప్రదీప్‌ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిజాలు చెప్పించారు. తామే హత్య చేశామని శిల్ప, మధు అంగీకరించారు. అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు