ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

19 Jun, 2021 20:02 IST|Sakshi
బావిలో ఆకుల మహేష్‌ మృతదేహం

సాక్షి, వరంగల్‌: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో తన భర్తను హత్య చేయించింది ఓ మహిళ. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో చోటుచేసుకుంది. వివరాలు.. ఘట్ కేసర్‌కు చెందిన అశ్వినికి ఆకుల మహేతో ఏడాది క్రితం వివాహమైంది. మహేష్‌ ఆటో నడుపుతూ జీవనం గడిపేవాడు. ఈ నెల 5 వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన మహేష్ తిరిగి రాకపోవడంతో ఘట్ కేసర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. పోలీసులు అతని సెల్ నంబర్ అనాలిసిస్ చేశారు. చివరి లొకేషన్ నమిలిగొండ అని చూపింది. దీనితో కాల్ లిస్టులో చాలాసార్లు ఉన్న నెంబర్ అడ్రస్‌ను పోలీసులు తెలుసుకున్నారు.

అందులో పసుల కుమార్ అనే వ్యక్తి నంబర్‌ ఉండగా..అతనిది మీదికొండ గ్రామంగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా మహేష్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు.  మహేష్‌ను ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ నుంచి నమిలిగొండలోని తన బామ్మర్ది పాలేపు కృష్ణ ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అతనికి మద్యం తాగించి రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉంచి.. తరువాత నమిలిగొండ శివారులోని రేకుల కొట్టం వద్ద తలపై రాయితో కొట్టి చంపినట్లు పేర్కొన్నాడు. అనంతరం మృతదేహాన్నిసంచిలో మూటగట్టి బావిలో పడేశానని వెల్లడించాడు. 


మహేష్‌ మృతదేహాన్ని బావి నుంచి పైకి తీసున్న పోలీసులు

అయితే పెళ్లికి ముందు నుంచే మృతుని భార్య ఆకుల అశ్వినితో పసుల కుమార్ అక్రమ సంబంధం పెట్టుకుని, తమ  అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మృతుని భార్య అశ్వినిని ఘట్ కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. 

చదవండి: 
దొంగతనం కేసులో ఇద్దరు సీరియల్‌ యాక్టర్స్‌ అరెస్ట్‌
దారుణం: తల్లిదండ్రులను కోల్పోయిన చెల్లెలిపై మూడేళ్లుగా..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు