విషాదం: రిటైర్డ్‌ ప్రొఫెసర్ దంపతుల క్షణికావేశం

28 Oct, 2021 11:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీలో  విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన  ఢిల్లీ యూనివర్సిటీకి రిటైర్డ్‌ ప్రొఫెసర్  దంపతులు బలవంతంగా ఊపిరి తీసుకున్నారు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేర్‌టేకర్‌ అజిత్  వారి ఇంటి  బెల్ మోగించినపుడు వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో  బాధిత దంపతుల కుమార్తె అంకితకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. (Covid-19: టీకా తీసుకున్నా, రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి)

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గోవింద్‌పురిలోని కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌లోని తమ నివాసంలో రాకేష్ కుమార్ జైన్ (74), అతని భార్య ఉషా రాకేష్ కుమార్ జైన్ (69) స్టీల్‌ పైపునకు ఉరివేసుకుని కనిపించారు. అనారోగ్యం కారణంగా ఎక్కువ సమయం మంచానికే పరిమితమై ఉండడంతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసు కున్నట్టు  సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన  సూసైడ్‌ నోట్‌నుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కాగా  గతేడాది యూపీలోని గోండాకు వెళ్తుండగా జైన్‌ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ  సమయంలో  రాకేష్ జైన్‌కు వెన్నులో తీవ్ర గాయం కాగా,  ఉషాకు మల్టిపుల్‌ ఫ్రాక్చర్స్‌ అయ్యాయి. దీంతో ఇద్దరూ మంచాన పడ్డారు.  అయితే చికిత్స అనంతరం కేర్‌ టేకర్‌ సాయంతో  కోలుకుని ఇపుడిపుడే కొద్దిగా నడుస్తున్న తరుణంలో ఈ దంపతులు  తీసుకున్న నిర్ణయం వారి కుటుంబ సభ్యులకు ఆవేదన మిగిల్చింది. 

మరిన్ని వార్తలు