రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు

27 Mar, 2023 00:40 IST|Sakshi

పెదవేగి : రాట్నాలకుంట గ్రామంలో వేంచేసియున్న శ్రీరాట్నాలమ్మ అమ్మవారిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం ప్రీతికరమైన రోజుకావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ వారం అమ్మవారికి పూజాటికెట్లపై రూ.30,430, విరాళంపై రూ రూ.41,663, లడ్డూ ప్రసాదం వలన రూ.14,820, ఫొటోల అమ్మకం ద్వారా రూ.2,800 లభించగా, మొత్తం రూ.86,913 ఆదాయం లభించిందని దేవస్థానం చైర్మన్‌ చల్లగొళ్ళ వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌ చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దుబాయ్‌లో జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

పెనుగొండ: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబీల్లో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ దుబాయ్‌లో దళిత క్రైస్తవ సంఘాలు, వైఎస్సార్‌ సీపీ నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొడమంచిలికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు తరపట్ల మోహన్‌ దుబాయ్‌ నుంచి వివరాలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దళిత క్రైస్తవుల చిరకాల కోరికను సీఎం వైఎస్‌ జగన్‌ తీర్చడానికి ముందడుగు వేశారన్నారు. సీఎం జగన్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. క్షీరాభిషేకం చేసిన వారిలో పాలపర్తి నీలిమ, కాగిత కుమార్‌, గోసంగి లక్ష్మీ, కొల్లే రవికుమార్‌, నక్కా ఎలిజబెత్‌, ఓగూరి శ్రీనివాస్‌, ఈద శరత్‌ బాబు, మారుముడి సుధ, నాగమణి, సాగర్‌, అనిల్‌ మోక మురళి, నల్లి రామరాజు, గోడి తాడి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు