స్త్రీ శక్తి: ఆర్మీ లాయర్‌ అఖిల

4 Mar, 2022 04:29 IST|Sakshi

‘అఖిల నారాయణ్‌ గురించి కాస్త చెప్పండి’ అని అడిగితే... సమాధానం తట్టక బుర్ర గోక్కునేవాళ్లు ఉండొచ్చు. సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లు అయితే ‘ఆ..గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం ఒక సినిమాలో నటించింది కదా!’ అంటారు. అరుల్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ్‌ హారర్‌ మూవీ ‘కదంపారీ’లో అఖిల నటించింది. అయితే ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఈ హారర్‌  సినిమా మాత్రమే అక్కర్లేదు. యూఎస్‌లో భారత సంతతికి చెందిన అఖిల తాజాగా అక్కడి సైన్యంలో లాయర్‌గా చేరింది. ‘భేష్‌’ అనిపించుకుంటోంది. లీగల్‌ అడ్వైజర్‌గా ఆమె సేవలు అందించనుంది. ‘యూఎస్‌ ఆర్మీ కంబాట్‌ ట్రైనింగ్‌’లో కొన్ని నెలల పాటు కఠినమైన శిక్షణ పొందింది అఖిల. రెడ్, వైట్, బ్లూ...అనే మూడు దశల్లో సాగే  ఆర్మీ కంబాట్‌ ట్రైనింగ్‌లో వెపన్‌ ఆపరేటింగ్, వారియర్‌ టాస్క్, బ్యాటిల్‌ డ్రిల్స్, టాక్టికల్‌ స్కిల్‌...మొదలైనవాటిలో శిక్షణ ఇస్తారు. అఖిలకు సంగీతం అంటే బోలెడు ఇష్టం. ‘నైటింగిల్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ పేరుతో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు