Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్‌ బీ6 వల్ల..

27 Jan, 2022 12:24 IST|Sakshi

పిస్తా పప్పు.. చూడగానే నోరూరిపోతుంది! చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చాలా మంది రోజూవారీ డైట్‌లో తప్పక దర్శనమిస్తుంది ఈ పిస్తా. ఈ అలవాటు మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. పిస్తా కేవలం రుచికి మాత్రమే కాదు... మంచి బలవర్ధకమైన ఆహారం కూడా.

కొంచెం తిన్నా చాలు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో మనకు కావాల్సిన శక్తి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా ​​​కూడా ఒకటి. మరో విషయం.. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. 

పిస్తా పప్పులో ఉండే పోషకాలు: 
పిస్తా పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. 
పిస్తాలో  పీచు పదార్థాలు, మాంసకృత్తులు కూడా ఎక్కువే. 
ఇక పిస్తాలో లభించే విటమిన్లు.... విటమిన్‌ బి6, సి, ఇ.
పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ. 
ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్‌ క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి.
ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే... పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

సాధారణంగా ఒక ఔన్సు అంటే (28 గ్రాములు) సుమారు 49 పిస్తా పప్పుల్లో ఉంటే పోషకాలు..
కాలరీలు: 159
కార్బోహైడ్రేట్లు: 8 గ్రా.
ఫైబర్‌: 3 గ్రా.
ప్రొటిన్‌: 6 గ్రా.
ఫ్యాట్‌: 13 గ్రా.(90 శాతం అనుశాటురేటెడ్‌ ఫ్యాట్స్‌)
పొటాషియం: 6 శాతం
ఫాస్పరస్‌: 11 శాతం
విటమిన్‌ బీ6: 28 శాతం
థయామిన్‌: 21 శాతం
మెగ్నీషియం: 15 శాతం.

చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్‌ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల...

పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
డ్రై ఫ్రూట్స్‌ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ. 
ఇందులోని విటమిన్‌ బి6 ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. 
రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. 
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి.
పిస్తాలోని అధిక ఫైబర్‌, ప్రొటిన్‌ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో తక్కువగా తినడం.. తద్వారా బరువు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది.
ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్‌ బి6 అధికంగా లభించే ఆహారపదార్థాల్లో పిస్తా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి పిస్తా తినడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు.
ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియాను పెంపొందిస్తుంది.
ఇందులో ఉండేది ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వే కాబట్టి డైట్‌లో పిస్తాను చేర్చుకోవచ్చు.

చదవండి:  Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల..

మరిన్ని వార్తలు