నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటున్నారా? ఇవి తెలుసుకోండి!

27 Feb, 2024 13:48 IST|Sakshi

ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. అందులోనూ వేసవిలో నానబెట్టిన ఎండుద్రాక్షను రోజూ తీసుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా? ఆ వివరాలు మీకోసం..

ఎండుద్రాక్షలో అద్భుతమైన  పోషకాలున్నాయి., వీటిని పచ్చిగా తినవచ్చు లేదా బేకింగ్, వంట ,బ్రూయింగ్‌లో ఉపయోగించవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా ఎండుద్రాక్షలు అందుబాటులో ఉంటాయి. ద్రాక్ష రకాన్ని బట్టి ఆకుపచ్చ, నలుపు, గోధుమ, నీలం, ఊదా , పసుపు రంగుల్లో ఇవి లభ్యం. 

వేసవి సీజన్‌లో ద్రాక్షపండ్లు ఎక్కువగా లభిస్తాయి. పచ్చి, లేదా ఎండు ద్రాక్ష , ఎలా  తిన్నా ఫలితాలు బావుంటాయి  ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ బి-6, మాంగనీస్, ఐరన్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. అయితే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి.  

వేసవిలో మరీ ముఖ్యం
ముఖ్యంగా  వేసవిలో రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయమే పరగడుపున తాగాలి.  చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఎండుద్రాక్షలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలన్నాయి. ఇంకా సీ, బీ  విటమిన్‌  పుష్కలంగా  లభిస్తుంది.  సీజనల్ వ్యాధులు, ఫ్లూ మొదలైన వాటి నుంచి రక్షణ లభిస్తుంది. కేన్సర్‌ రిస్క్‌ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!

రక్తహీనతకు
ఇందులోని ఐరన్ కంటెంట్‌ రక్తహీనతను నివారించి,  హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం కోసం ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ అధికం. అజీర్తి, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడుతారు. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఎన్‌ఆర్‌ఐ మహిళకు బ్యాంకు మేనేజర్‌ టోకరా

ఎముకలకు బలం
ఎండుద్రాక్షలోని బోరాన్ ఆరోగ్యకరమైన ఎముకల అభివృద్ధికి  దోహదపడుతుంది. కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువే. నానబెట్టిన ఎండుద్రాక్షను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

ఎనర్టీ బూస్టర్
ఎండుద్రాక్షలో సహజంగా గ్లూకోజ్ , ఫ్రక్టోజ్ ఎక్కువగా లభిస్తాయి. ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది .
 

whatsapp channel

మరిన్ని వార్తలు