హెల్మెట్‌ ధరించలేదు సరికదా, అడిగితే పోలీసు వేలు కొరికేశాడు

13 Feb, 2024 16:35 IST|Sakshi

హెల్మెట్‌  ధరించలేదని అడిగినందుకు  ఒక వ్యక్తిట్రాఫిక్‌ పోలీసుపై అనుచితంగా ప్రవర్తించిన  ఘటన  ఒకటి  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం  హెల్మెట్‌ ధరించడం  తప్పని సరి.  ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పోలీసులు అడ్డుకున్నారు.  ఈ   సందర్బంగా  జరిగిన వివాదంలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై దుర్భాషలాడి ట్రాఫిక్ పోలీసు వేలిని కొరికిన  ఘటన బెంగుళూరులో  నమోదైంది.

విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ దగ్గర సయ్యద్ సఫీని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్‌ ఏదని ప్రశ్నించారు.  ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్కూటర్ కీని లాక్కున్నాడు.  ఆసుపత్రికి వెళుతుండగా హెల్మెట్ ధరించడం మర్చిపోయానంటూ వివరించే ప్రయత్నం చేశాడు సయ్యద్‌.

మరోవైపు హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజాలగిహెల్మెట్‌ నిబంధన ఉల్లంఘించినందుకు సఫీని రికార్డ్ చేయడానికి  ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సయ్యద్‌, ట్రాఫిక్‌ పోలీసులను  తీవ్రంగా ప్రతిఘటించాడు.  హెడ్ కానిస్టేబుల్ ఫోన్‌ను లాక్కొని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారనిప్రశ్నించాడు. అలాగే తన వీడియో వైరల్‌గా మారినా నాకేం ఫరక్‌ పడదన్నట్టు వాదించాడు. దీంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, శారీరకంగా గాయపర్చడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega