హెయిర్‌ డైగా 'ఉజాలా'..కట్‌ చేస్తే హెయిర్‌ ఎలా ఉందంటే..!

13 Feb, 2024 17:05 IST|Sakshi

యువత వింత వింత వేషధారణలు, విచిత్రమైన స్టయిల్స్‌ని పరిచయం చేస్తున్నారు. అందులో కొన్ని సౌలభ్యంగా ఉన్న మరికొన్ని బాబాయ్‌! ఏంటిదీ అనేలా ఉంటున్నాయి. అలాంటి వెరైటీ ప్రయోగమే చేశాడు ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌. 

రాహుల్‌ కల్శెట్టి అనే హెయిర్‌స్టైలిస్ట్‌ తన కస్టమర్‌కి ఉన్న బ్లీచ్డ్‌ హెయిర్‌కి ఉజాలను హెయిర్‌ డైగా ఉపయోగించాడు. కొద్దిసేపటి తర్వాత నలుపు తెలుపు మిక్స్‌ అయ్యి  ఓ అందమైన లుక్‌ వచ్చింది. చూడటానికి బాగుంది కూడా. ఇక హెయిర్‌ స్టైయిలిస్ట్‌ ఇలా ఉజాలతో హెయిర్‌ డై వేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రజలు ఒక్కసారి ఇలా చేసి చూడమని డిమాండ్‌ చేశారని, అందువల్ల తాను ఈ ధైర్యం చేశానని చెప్పాడు.  అంతేగాదు అందుకు సంబంధించని వీడియోని కూడా సదరు స్టైయిలిస్ట్‌ నెట్టింట షేర్‌ చేశాడు కూడా. 

A post shared by Rahul Kalshetty (@haireducation_rahul)

అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి.. ఉజాలాకి ఇక డిమాండ్‌ పెరిపోతుందేమో అని ఒకరూ, తదుపరి హార్పిక్‌ ట్రై చెయ్యండిని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా తెల్లబట్లలు కాంతివంతంగా కనిపించేందుకు ఉపయోగించే ఉజాల హెయిర్‌ డైగా వినియోగిస్తే అనే ఆలోచనే వెరైటీ. పైగా ట్రే చేసి ఇది కొత్త ట్రెండ్‌ అని చూపించడం మరింత విశేషం. 

A post shared by Rahul Kalshetty (@haireducation_rahul)

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega