గాలెంటైన్స్‌ డే: ఇది ఎవరు, ఎపుడు జరుపుకుంటారో తెలుసా?

13 Feb, 2024 17:10 IST|Sakshi

గాలెంటైన్స్ డే 2024. వాలెంటైన్స్‌ డే గురించి అందరికీ తెలుసు. లవ్‌బర్డ్స్‌ వారం రోజుల పాటు సంబరాలు  చేసుకుంటారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అంటూ రోజులు గడిచిపోయాక ఎనిమిదో రోజు  ఫిబ్రవరి 14న వాలెండైన్స్‌ డేగా జరుపుకుంటారు. మరి  గాలెంటైన్స్ డే గురించి తెలుసా.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న, "లేడీస్ సెలబ్రేటింగ్ లేడీస్" కోసం గాలెంటైన్స్ డేని జరుపుకుంటారు. స్నేహితురాళ్లు ప్రేమపూర్వ బహుమతులను ఇచ్చిచ్చుకుంటారు  ఇది మీ స్నేహితురాళ్ళతో ప్రేమతో పాటు కొన్ని బహుమతుతలో హ్యాపీగా గడిపే రోజు. మహిళా స్నేహితుల స్నేహాన్ని, ప్రేమను హైలైట్ చేయడానికి ఇలా  ఒక నిర్దిష్ట రోజును  కేటాయించారు.

గాలెంటైన్స్ డేని లెస్లీ నోప్ ప్రాచుర్యంలోకి తెచ్చారు.  గాలెంటైన్స్ డే అనేది అమెరికన్ సిట్‌కామ్  పార్క్స్ అండ్ రిక్రియేషన్  రెండో సీజన్ 16వ ఎపిసోడ్‌లో ఆ రోజు గురించి ప్రస్తావన ఉంది. ఈ ఎపిసోడ్‌లో, లెస్లీ నోప్ (అమీ పోహ్లర్) వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు తన మహిళా స్నేహితుల కోసం తన వార్షిక గాలెంటైన్స్ డే పార్టీని ఏర్పాటు చేసింది. ఇది మహిళల సెలబ్రేషన్‌ రోజు. ఈ రోజును ఎలా గడుపుతారు అనేది మీరు మీ స్నేహితుల ఇష్టం! ఇది మీ రోజు అని నోప్‌ ప్రకటించారు.  అప్పటినుంచి  గాలెంటైన్స్‌ డే ప్రాచుర్యంలో వచ్చింది. ( Valentines day: లవ్‌బర్డ్స్‌తో, ప్రేమికుల పోలిక: ఈ ఇంట్రస్టింగ్‌ సంగతులు తెలుసా?)

కరీనా నటాషా గాలెంటైన్స్‌ డే
బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, వ్యాపారవేత్త భార్య నటాషా పూనావాలా  మంచి బెస్టీలు, గత ఏడాది వీరిద్ద విలాసవంతమైన వింటర్ ఫ్యాషన్‌లో దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఏడాది గ్యాలెంటైన్స్‌ డే సందర్భంగా నటాషా ఆ  మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమేజింగ్‌ ఫోటోలను షేర్‌ చేసింది, 

National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా? 

A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega