Braille Menus: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్‌లన్నీ..

5 Sep, 2023 15:45 IST|Sakshi

రెస్టారెంట్‌లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్‌కి వచ్చి.. మెను చూసి ఆర్డర్‌ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్‌నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్‌ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!.

ఇండోర్‌లోని గురుకృపా రెస్టారెంట్‌ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్‌ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్‌. మహేష్‌ దృష్టిహీన్‌ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్‌కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్‌ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్‌లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్‌ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

యంగ్‌ ఇండియన్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ భావన గనేదివాల్‌ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్‌లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్‌ దృష్టిహీన్‌ కళ్యాణ్‌ సంఘ్‌ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్‌ వేశాం. అది నిజంగా సక్సెస్‌ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్‌లను చండీగఢ్‌ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్‌లను ఇతర రెస్టారెంట్‌లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్‌లన్నీంటిలో ఈ  బ్రెయిలీ స్క్రిప్ట్‌ మెనూ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్‌ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్‌.

ఇక సదరు గురుకృపా రెస్టారెంట్‌ యజమాని సిమ్రాన్‌ భాటియా మాట్లాడుతూ.. యంగ్‌ ఇండియా గ్రూప్‌ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్‌లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్‌లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్‌ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్‌ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్‌ని చదవి ఆర్డర్‌ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్‌ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్‌ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్‌ కదూ!.

(చదవండి: వాట్‌! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్‌"! షాకింగ్‌ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!)

మరిన్ని వార్తలు