'ప్టోసిస్‌' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!

8 Nov, 2023 13:20 IST|Sakshi

ఎన్నో వింత వ్యాధులు. ఎందుకొస్తాయో తెలియదు. వాటి వల్ల అనుభవించే బాధ అంత ఇంత కాదు. బయటపడటం కూడా అంత ఈజీ కూడా కాదు. వైద్య శాస్త్రనికే సవాళ్లు విసిరే విచిత్రమైన వ్యాధులు రోజుకోకటి చొప్పున పుట్టుకొస్తూనే ఉన్నాయి. స్వయంకృతాపరాధమో మనిషి స్వార్థానికి పరాకాష్ట అనాలో తెలియదు. అలాంటి వింత వ్యాధినే ఇక్కడొక మహిళ ఎదుర్కొంటోంది. రోజురోజుకి పరిస్థితి దారుణంగా మారిందే తప్ప తగ్గలేదని బోరుమని విలపిస్తోంది. ఆ మహిళకు వచ్చిన వింత వ్యాధి ఏంటీ? ఎందువల్ల అంటే..

అమెరికాలో ప్రముఖ నటి జీనత్‌ అమన్‌ నాలుగు దశాబ్దాలుగా ప్టోసిస్‌ అనే పరిస్థితితో బాధపడుతోంది. కొన్నేళ్ల క్రితం కంటికి తగిలిన గాయమే ఇందుకు కారణం. ఆమె  కుడి కన్నుకు ఏర్పడిన గాయం కారణంగా ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత క్రమేణ కంటి రెప్ప కుంగిపోవడం లేదా కిందకు వాలిపోవడం జరిగింది. అలా పూర్తిగా కిందకు వచ్చేస్తోంది. అది ఆమె కంట్రోల్‌ లేదు. అంటే కనురెప్పను కదల్చలేదు. దీని వల్ల కనుచూపు తగ్గిపోతూ వచ్చింది. ఆఖరికి ఆపరేషన్‌ చేయించకున్న తన పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని ఇన్‌స్ట్రాగాం వేదికగా వాపోయింది. 

ఇంతకీ ప్టోసిస్‌ అంటే ఏంటీ..
ప్లోసిస్‌ అంటే 'డ్రూపింగ్‌ కనురెప్ప' అని అంటారు. దీని కారణంగా ఎగువ కనురెప్ప కుంగిపోవడం లేదా వైద్య పరిభాషలో స్థానభ్రంశం చెందడం అంటారు. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆప్తాల్మోలజీ ప్రకారం ఈ పరిస్థితి ఒకటి లేదా రెండు కనురెప్పలను ప్రభావితం చేస్తుంది. ఇది దృష్టిని ప్రభావితం చేయొచ్చు లేదా పూర్తిగా దృష్టిని కోల్పోవచ్చు. ఈ పరిస్థితి వయస్సు సంబంధిత మార్పలు కారణంగా గానీ కండరాల బలహీనత లేదా నరాల బలహీనత/ పుట్టుకతో వచ్చే వివిధ సమస్యలు కారణం కావచ్చు. 

ప్టోసిస్‌ లక్షణాలు..

  • కనురెప్పలు వంగిపోవడం
  • స్పష్టంగా చూడలేకపోవడం
  • కనురెప్పలు పైకి లేపాలంటే భారంగా అనిపించడం
  • కన్ను తెరవడమే కష్టంగా ఉండటం
  • దైనందిన పనులు చేసుకోవడం కూడా కష్టమవ్వడం తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే కంటి నిపుణుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. 

(చదవండి: మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..)

మరిన్ని వార్తలు