Nose Bleeding Problem: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఉల్లిపాయ, కొత్తిమీర, విటమిన్‌ ఇ క్యాప్సూల్‌తో!

6 Jun, 2022 12:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Nose Bleeding Problem: ఎండ వేడిమి ఎక్కువైతే కొంత మందిలో ముక్కులో నుంచి రక్తం విపరీతంగా కారుతుంది. వేడి ఎక్కువగా ఉన్న శరీరంలో అయితే తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఇలా రక్తం కారిన ప్రతిసారి ఆందోళనపడటం, భయపడటం చేస్తుంటారు. తగ్గడం కోసం రక రకాల మందులను ఉపయోగిస్తారు.

అయితే కారణం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులు వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్సు వస్తాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది...

ఇలా చేయండి!
ముక్కులో నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటే.. ఉల్లిపాయను గుండ్రంగా కట్‌ చేసుకొని, ఆ ఉల్లి ముక్కను ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన చూడాలి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. ఇలా చేయటం తొందరగా ఉపశమనం పొందుతారు.

రక్తం కారటాన్ని తగ్గించటంలో కొత్తిమీర పాత్ర కీలకం. కొత్తిమీర సహజంగానే చల్లదనాన్నిస్తుంది. ఇది ముక్కుకు సంబంధించిన అన్ని రకాల ఎలర్జీలను నివారించటంలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ముక్కు నుంచి రక్తం అధికంగా కారితే కొత్తిమీర తాజా రసాన్ని ముక్కు లోపలి అంచులకు రాసుకుంటే సరిపోతుంది.

ముక్కు నుంచి రక్తం కారటాన్ని తగ్గించటంలో తులసి మంచి ఔషధం. తులసి రసాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకోవటం లేదా తాజా తులసి ఆకులను నమలటం వల్ల కూడా ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి.

చిన్న పిల్లలకు ముక్కులో నుంచి రక్తం ఎక్కువగా కారితే విటమిన్‌ ఇ క్యాప్సూల్‌ను కత్తిరించి అందులో కొంచెం పెట్రొలియం జెల్లీ కలిపి డ్రాపర్‌తో ముక్కులో రెండు చుక్కలు వేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఈ సమస్య అధికంగా వేధిస్తుంటే విటమిన్‌ ’సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు రోజూ తినటం మంచిది.
అలాగే గోధుమలు, గోధుమ గడ్డితో తయారు చేసిన పదార్థాలను రోజూ తినటం మంచిది. ఎందుకంటే గోధుమల్లో జింక్, ఐరన్, నూట్రీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్త ప్రసరణను అదుపులో ఉంచుతాయి.

చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్‌’ వద్దు! ఇవి తినండి!
చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్‌- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్‌ ఉత్పత్తికి ఇది అవసరం!

మరిన్ని వార్తలు