మీకు తెలుసా..? 'మిస్టర్‌ ఈట్‌ ఆల్‌' తను ఒక అద్భుతం!

8 Dec, 2023 13:23 IST|Sakshi

ఈ సృష్టి ఓ అద్భుతం అనుకుంటే మనిషి అంతకుమించి అద్భుతాలు చేసి ఔరా! అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు ఎన్నో వింతలు విశేషాలు చేసి ఉంటాం. అంతకు మించిన వింతలు, విడ్డూరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే..?

► మిస్టర్‌ ఈట్‌ ఆల్‌.. ఫ్రాన్స్‌కు చెంది మైఖేల్‌ లోటిటోకు ‘మిస్టర్‌ ఈట్‌ ఆల్‌’ అని పేరు. ఇతడు ఐరన్, రబ్బరు, గాజులాంటివి కూడా తినేవాడు. ఈ వింత అలవాటుతో గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌లో చోటు సంపాదించాడు. ఇనుమును ఎలక్ట్రిక్‌ పసర్‌ సా తో చిన్న చిన్న ముక్కలు చేసి తినేవాడు. పదహారు సంవత్సరాల వయసులో తొలిసారిగా గాజు గ్లాస్‌ను పగలగొట్టి తిన్నాడు. తన యూనిక్‌ టాలెంట్‌తో ప్రపవచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 2007లో చనిపోయాడు.

► బ్రెజిల్‌ కారాగారాలలో ఖైదీలకు ఎక్సర్‌ సైజ్‌ బైక్‌లను తొక్కే అవకాశం ఇస్తారు. ఈ బైక్‌లు కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి.

► ‘ఫేస్‌ బుక్‌’ వచ్చాక ‘అన్‌ఫ్రెండ్‌’ అనే మాట ప్రాచుర్యం పొందింది. అయితే 1659లో వచ్చిన ‘ది అపీల్‌ ఆఫ్‌ ఇన్జ్యుర్డ్‌ ఇనోసెన్స్‌’ పుస్తకంలో ఈ పదాfన్ని కాయిన్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు