మహారాష్ట్ర పాపులర్‌: రొయ్యలతో పోహా, భలే రుచిగా ఉంటుంది

28 Sep, 2023 13:22 IST|Sakshi

ప్రాన్స్‌ పోహ తయారీకి కావల్సినవి:
కావలసినవి:  రొయ్యలు – 10 (మీడియం సైజ్‌ లేదా పెద్దవి.. 
తల, తోక తొలగించి.. శుభ్రం చేసుకోవాలి)
అటుకులు – 3 కప్పులు (నీళ్లల్లో కడిగి.. నీళ్లు పోయేలా వడకట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నగా కట్‌ చేసుకోవాలి), బంగాళదుంప›– 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు తరగాలి), పచ్చి బఠాణీ – అర కప్పు (నానబెట్టి, ఉడికించుకోవాలి)
వేరుశనగలు – అర కప్పు, అల్లం తురుము – అర టీ స్పూన్‌
కొబ్బరి కోరు – 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర  తురుము – కొద్దిగా
కరివేపాకు – కొద్దిగా, ఆవాలు – 1 టీ స్పూన్‌
పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – 1 టీ స్పూన్‌
పచ్చిమిర్చి ముక్కలు – పావు టీ స్పూన్‌

తయారీ విధానమిలా:

ముందుగా నూనెలో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని.. అర నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ.. దోరగా వేయించుకోవాలి. అందులో వేరుశనగలు, బంగాళదుంప ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉడికించుకోవాలి. బంగాళదుంప ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిప్పాలి. తర్వాత రొయ్యలు, బఠాణీలు వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు రొయ్యలు ఉడికాక.. కొబ్బరి కోరు, కొత్తిమీర తురుము వేసుకుని తిప్పాలి. ఇక చివరిగా అటుకులు వేసి ఇటూ అటూ గరిటెతో తిప్పాలి. అనంతర స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా అల్లం ముక్కను తురిమి.. నిమ్మకాయ ముక్కలతో సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ డిష్‌. 

మరిన్ని వార్తలు