Saag Chicken Recipe: హర్యానా వంటకం.. సాగ్‌ చికెన్‌ తయారీ ఇలా!

1 Jul, 2022 16:11 IST|Sakshi

దేశ రాజధాని దిల్లీకి అత్యంత చేరువలో ఉన్న రాష్ట్రం హర్యానా. హర్యానీల ప్రధాన వంటకాల్లో రోటి చాలా ప్రత్యేకం. అందులోకి వారు వండుకునే సాగ్‌ చికెన్‌ గురించి తెలుసుకుందాం...

సాగ్‌ చికెన్‌
కావలసినవి:  
►చికెన్‌ – అరకేజీ
►ఆవాలు – అరటీస్పూను
►జీలకర్ర – టీస్పూను
►ఎండు మిర్చి – రెండు
►ఉల్లిపాయముక్కలు – రెండు కప్పులు
►టొమాటో తరుగు – కప్పు
►పచ్చిమిర్చి – రెండు
►వెల్లుల్లి రెబ్బలు – ఆరు

►అల్లం – అంగుళం ముక్క
►పసుపు – రెండు టీస్పూన్లు
►కారం – ఒకటిన్నర టీస్పూన్లు
►ధనియాల పొడి – టేబుల్‌ స్పూను
►జీలకర్ర పొడి – టేబుల్‌ స్పూను
►పాలకూర – రెండు కప్పులు
►ఉప్పు – రుచికి సరిపడా
►ఆయిల్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు.

తయారీ..
►ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగును బ్లెండర్‌లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి.
►పాలకూరను శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బి పక్కనపెట్టుకోవాలి
►స్టవ్‌ మీద బాణలి పెట్టి ఆయిల్‌ వేయాలి.
►కాగిన ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ∙
►ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙
►తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, శుభ్రంగా కడిగిన చికెన్‌ ముక్కలు, రుచికిసరిపడా ఉప్పు వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి
►ఇప్పుడు టొమాటో తరుగు, పాలకూర పేస్టు వేసి ఆయిల్‌ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి
►ఆయిల్‌ పైకి తేలిన తరువాత మరికొన్ని నీళ్లు పోసి చికెన్‌ ముక్కలు మెత్తగా ఉడికించి దించేయాలి.

 ఇవి కూడా ట్రై చేయండి: Makki Roti: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో సులువుగా మక్కి రోటీ తయారీ! 
Indonesian Chicken Satay Recipe: ఇవన్నీ కలిపి బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే!

మరిన్ని వార్తలు