దంతాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎక్కువరోజులు జీవిస్తామట!

30 Jul, 2022 13:46 IST|Sakshi

దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు జీవించగలగడమే కాదు.. మధుమేహం, గర్భధారణ సమస్యలు, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రాత్రిపూట బ్రష్‌ చేయడం వల్ల జీవన కాలం పెరుగుతుంది. రాత్రి పూట బ్రష్‌ చేసే వారితో పోల్చితే చేయని వారికి అనారోగ్య సమస్యలు 30 శాతం పెరిగినట్టు కనుగొన్నారు.

అంతేకాదు.. పంటి పగుళ్ల సమస్యతో ఆహారం సరిగా నమల లేక జీర్ణ సమస్యలకు గురయ్యే వారి రేటు కూడా ఎక్కువగానే ఉందని వెల్లడైంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తక్కువ దంతాలను కలిగి ఉన్నవారితో పోల్చితే.. ఎక్కువ దంతాలను కలిగి ఉన్న వారిలో వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది.  

మరిన్ని వార్తలు