నిద్ర లేవగానే విపరీతంగా తుమ్ములు వస్తున్నాయా? ఇలా చేయండి

25 Nov, 2023 16:26 IST|Sakshi

కొంతమందికి నిద్రలేవడంతోనే విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటి వారు తులసి, పుదీనా, రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకొని రోజూ ఒక కప్పు కషాయం తీసుకుంటుంటే నెలరోజుల్లో సమస్య తీరిపోతుంది. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండండి . తుమ్ములు ఆగుతాయి. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం పూర్తి ఉపశమనం ఇస్తుంది.

వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకొని పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు.

ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని ఒక కప్పు వేడినీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

మరిన్ని వార్తలు