Social Media Influencers Guidelines: ఫ్రీగా కానుకలు, కూపన్‌ కోడ్‌లు.. ఆశ పడి ప్రమోషన్‌ చేశారో.. అంతే సంగతి!

14 Sep, 2023 10:19 IST|Sakshi

సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వ్యూవర్స్‌ని యాడ్స్‌ ద్వారా ప్రభావితం చేస్తుంటారు. వీరితో పాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కూడా ఇ–కామర్స్‌ సంస్థల బ్రాండ్స్‌ను ఎలా ప్రచారం చేయాలో తెలుసుకోవాలి. ప్రకటనదారులు ఇన్‌ఫ్లుయెన్సర్లకు కానుకల ఆశ చూపి, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మార్చుకుంటారు.

ఇవి తెలియని ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులకు, సేవలకు ప్రచారకర్తలుగా మారిపోతారు. వీరు చెప్పే బ్రాండ్స్‌ను గుడ్డిగా నమ్మి వ్యూవర్స్‌ వాటిని కొనుగోలు చేసి, మోసపోవచ్చు. అందుకే, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులోకి తీసుకు వచ్చింది. ఉత్పత్తులు, సేవల గురించి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను మోసం చేస్తే వారు శిక్షార్హులు అవుతారని చెబుతోంది. 

వ్యూవర్లను, సబ్‌స్రైబర్లను పొందాలంటే.. 
సాధారణంగా ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్‌మీడియా ఛానెల్స్‌లో పోస్ట్‌ చేసిన వాటి విషయంలో ఈ పరిస్థితి తలెత్తదు. వాటిలో స్వీయప్రచారం లేదా సబ్‌స్రైబర్స్‌కి ఏదైనా సూచన ఇవ్వడం కనిపిస్తుంది. లాంగ్‌టైమ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఒకరిగా సక్సెస్‌ కావాలంటే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగానే ఉండాలి. 


అర్ధవంతమైన కంటెంట్, సంభాషణను ప్రదర్శించాలి. 
► సబ్‌స్రైబర్లు, ఫాలోవర్లను కట్టిపడేలా మీ కంటెంట్‌ సమయాన్ని పెంచుకోవచ్చు. వ్యూవర్స్‌ అన్ని కామెంట్స్‌కు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. 
► సబ్‌స్క్రైబర్ల దృష్టి కోణం నుండి మీ పోస్ట్‌ ఉండేలా చూసుకోండి. కృత్రిమమైన డ్రామాను ప్లే చేయకూడదు. 

► మీ ఛానెల్‌ను ఫాలో అవమని వ్యక్తులను అడగడంలో మీరు ఎంత పెద్దవారైనప్పటికీ సిగ్గుపడకూడదు. సబ్‌స్రైబర్లను కొనుగోలు చేయడం కంటే సోషల్‌మీడియా ఛానెల్‌లో ప్రమోషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
► మీ పోటీదారులు ఎవరు, వారు సోషల్‌ మీడియాలో ఏమేం చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. వారిని ఫాలో అవడం ద్వారా మీ లోపాలను సులభంగా గుర్తించి, సరి చేసుకోవచ్చు. అంతేకాదు, సబ్‌స్క్రయిబర్లను పెంచుకునే వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. 
► ప్రతిరోజూ ఉండాలి కదా అని ఏదో ఒకటి పోస్ట్‌ చేయకండి. అది మీ వ్యూవర్స్‌ని పెంచదు. ప్రతి పోస్ట్‌ మీ లక్ష్యానికి చేరువ చేస్తుందా అని నిర్ధారించుకోండి. క్వాలిటీ కంటెంట్‌పైనే దృష్టి పెట్టండి. 
► సాధారణంగా కొందరు రెచ్చగొట్టే చర్చలను, వివాదాలను సృష్టించడానికి ట్రోల్‌ చేస్తారు. దీనివల్ల సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లను సంతోషపెట్టలేరు. అలాగని, మీపై ట్రోల్‌ చేయడంలో వారి పూర్తి పాయింట్‌ అదే కాబట్టి ట్రోల్‌లను విస్మరించకూడదు. 
► అన్ని సామాజిక ఛానెల్స్‌ కంటెంట్‌ను మానిటైజ్‌ చేస్తున్నందున జాగ్రత్తపడాలి. వార్తలు, వినోదం కోసం ఫేస్‌బుక్, బ్లాగ్‌ పోస్ట్‌లకు ట్విటర్, ఫోటోలు, వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్, ఇండస్ట్రీలకు సంబంధించిన కథనాలకు లింక్డ్‌ ఇన్‌.. ఇలా దేనికది ఎంచుకోవాలి. 
► మీ ప్రతిస్పందనలోనూ నిజాయితీగా ఉండండి. సోషల్‌మీడియా ఉనికికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. 
► హాష్‌ట్యాగ్‌ల విషయాలపై సరైన పరిశోధన చేయండి. లేకుంటే, హ్యాష్‌ట్యాగ్‌లు మీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. 

ప్రకటనలు ఎలా చేయాలి?

  • ప్రకటనలు స్పష్టంగా, ప్రముఖంగా, మిస్‌ చేయడం చాలా కష్టంగా ఉండే విధంగా ఎండార్స్‌మెంట్‌ 
  • సందేశంలో ఉంచాలి. హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింక్‌ల సమూహంతో యాడ్స్‌ను బహిర్గతం చేయకూడదు.
  • వ్యూవర్స్‌ గమనించే విధంగా ప్రకటనల ఎండార్స్‌
  • మెంట్‌ ఇమేజ్‌పై ఉంచాలి.
  • ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్‌లో చేయాలి.
  • ప్రకటనలు మొత్తం లైవ్‌స్ట్రీమ్‌లో ప్రదర్శించాలి. 
  • సింపుల్‌ అండ్‌ క్లియర్‌ లాంగ్వేజ్‌ ఉండాలి. 

 
తగిన శ్రద్ధ ..
సెలబ్రిటీలు/ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రకటనలో చూపిన విధంగా ఆ ఉత్పత్తులను తాము వాడి, ప్రయోజనం పొందేలా కూడా ఉండాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండార్సర్‌ ద్వారా ఉపయోగించబడి ఉండాలని కూడా సిఫార్సు చేయబడింది.
► ఒక ప్రముఖ ఇ–కామర్స్‌ సంస్థ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడానికి తమ బ్రాండ్‌ దుస్తులను ధరించమని, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల కోసం కంటెంట్‌ను రూపొందించమని కోరాలి.
► సెలబ్రిటీలు, ఇన్ఫ్లు‌యెన్సర్‌లు ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను పోస్ట్‌ చేస్తే ఆ బ్రాండ్స్‌ను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమోట్‌ చేస్తున్నట్లు కనిపించాలి.
► సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్‌ కనెక్షన్‌ ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం 
పక్షపాతంగా లేదా తప్పుదారి పట్టించేదిగా ఉందనుకోవాలి.  
► ఏదైనా మెటీరియల్‌ కనెక్షన్‌ ను బహిర్గతం చేయడంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు ఫెయిల్‌ అయితే వినియోగదారుల రక్షణ చట్టం – 2019 కింద చట్టం ప్రకారం కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. 

ఉచిత ఉత్పత్తుల వల్ల..

వ్యూవర్స్‌ నిర్ణయాలు లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రముఖ వ్యక్తులు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యూవర్స్‌ అభిప్రాయాలపై బలమైన ప్రభావంతో ఉత్పత్తుల, సేవలను ప్రకటించే సృష్టికర్తలు మాత్రమే. ప్రకటనల కంపెనీలు వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. ట్రిప్స్‌ లేదా హోటల్‌ వసతి, ఉచిత ఉత్పత్తులు, అవార్డులు.. మొదలైనవి జత చేస్తారు. ఇక, వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు కంప్యూటర్‌ సృష్టించిన వ్యక్తులు. వీటి ద్వారా కూడా యాడ్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. 

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల,
 డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

మరిన్ని వార్తలు