వెన్నపాలు తినవలె...

9 Aug, 2020 01:08 IST|Sakshi

శ్రీకృష్ణుడు వాడవాడలా తనకు పెట్టిన కొత్తకొత్త నైవేద్యాలను చూశాడు... అబ్బో! భక్తులు ఎంత మారిపోయారో అని మురిసిపోయాడు... సంప్రదాయ వంటకాలనూ చూశాడు.. అదేవిధంగా మురిసిపోయాడు. నేను వెన్నపాలు తింటే, నా భక్తులు కూడా అవే తింటున్నారు... మరి నేను కూడా వారు పెట్టిన బువ్వలు తినాలిగా అనుకున్నాడు. మనం కూడా ఈ జన్మాష్టమి నాడు మనకు తోచినన్ని నైవేద్యాలు తయారు చేసి.. భక్తితో పరమాత్మునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం.. కృష్ణం వందే జగద్గురుమ్‌ అందాం...

ధనియా పంజీరీ
ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్‌ రాష్ట్రాలలో ఈ ప్రసాదాన్ని శ్రీకృష్ణుడికి నివేదిస్తారు.
కావలసినవి: ధనియాలు – 2 టేబుల్‌ స్పూన్లు ; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు ; నెయ్యి – తగినంత ; జీడిపప్పు తరుగు + బాదం పప్పు తరుగు +  పిస్తా తరుగు +  పటికబెల్లం బిళ్లలు + కిస్‌మిస్‌ – అన్నీ కలిపి ఒక టేబుల్‌ స్పూను.
తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు వేసి దోరగా వేయించి తీసేయాలి lబాగా చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా ఉండకూడదు) ∙ఒకపాత్రలో ధనియాల పొడి, పంచదార పొడి వేసి కలపాలి ∙నెయ్యి జత చేయాలి ∙చివరగా డ్రైఫ్రూట్స్‌ తరుగు జత చేసి, శ్రీకృష్ణుడికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి.
సాథ్‌ పడీ పూరీ
కావలసినవి: మైదా పిండి – రెండున్నర కప్పులు ; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు ; నీళ్లు – తగినంత ; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా. పేస్ట్‌ కోసం: బియ్యప్పిండి – అర కప్పు ; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారీ: ∙ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ పరాఠాల పిండిలా కలుపుకుని అరగంట సేపు పక్కన ఉంచాలి ∙మరొక పాత్రలో అర కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి పిండిని ముద్దలా చేçసుకోవాలి (నీళ్లు పోయకూడదు).
మైదాపిండిని సమాన భాగాలుగా చేసి ఒక్కో ఉండను చపాతీలా ఒత్తాలి ∙ముందుగా ఒక చపాతీ మీద బియ్యప్పిండి నెయ్యి కలిపిన ముద్దను కొద్దిగా పూసి ఆ పైన మరో చపాతీ ఉంచాలి ∙ఈ విధంగా మొత్తం ఏడు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక ఏడవ చపాతీ మీద కూడా బియ్యప్పిండి ముద్ద పూసి నెమ్మదిగా ఆ ఏడు చపాతీలను రోల్‌ చేయాలి ∙చాకుతో గుండ్రంగా ముక్కలు కట్‌ చేయాలి ∙ఒక్కో ముక్కను జాగ్రత్తగా అప్పడాల కర్రతో ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి.

మఖ్ఖ్ఖన్‌ మిస్రీ
శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనంలో మఖ్ఖన్‌ మిస్రీని ప్రసాదంగా అందచేస్తారు. తయారీ చాలా సులభం.
కావలసినవి: వెన్న – 100 గ్రా. (ఇంట్లో మజ్జిగ చిలికి తీసినది); çమిశ్రీ – 50 గ్రా. (పటికబెల్లం చిప్స్‌).
తయారీ: ఒక పాత్రలో వెన్న, పటిక బెల్లం చిప్స్‌ వేసి బాగా కరిగే వరకు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙బయటకు తీసి, ప్రసాదంగా చల్లచల్లగా తినాగోపాల్‌ కళ
కావలసినవి: బియ్యపు రవ్వ – అర కేజీ; కీర దోస ముక్కలు– అర కప్పు ; కొబ్బరి తురుము – పావు కప్పు; పెరుగు – ఒక లీటరు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన జీలకర్ర – 2 టీ స్పూన్లు.
తయారీ: ∙స్టౌ మీద పెద్ద పాత్రలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ∙బియ్యపు రవ్వ వేసి బాగా కలియ పెట్టి, సన్నని మంట మీద పూర్తిగా ఉడికించి దింపేయాలి ∙ఒక వెడల్పాటి పాత్రలో... ఉడికించిన బియ్యపు రవ్వ, కీర దోస ముక్కలు, కొబ్బరి తురుము, పెరుగు, పంచదార, నెయ్యి, వేయించిన జీలకర్ర వేసి బాగా కలపాలి ∙ఉండలుగా చేసుకుని, శ్రీకృష్ణుడికి నివేదన చేయాలి ∙ఈ ప్రసాదాన్ని పేదవారి ఆహారంగా చెబుతారు ∙గోకులాష్టమి నాడు అర్ధరాత్రి శ్రీకృష్ణుడిని ప్రార్థించి, భగవంతుడికి నివేదన చేసి, ఉపవాస విరమణ ప్రసాదంగా స్వీకరిస్తారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా