ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..?

15 Oct, 2021 14:15 IST|Sakshi

దాదాపుగా దశాబ్ధం తర్వాత మొదటిసారి క్షయ (టీబీ) మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గురువారం విడుదలచేసిన గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వెల్లడించింది. 

చదవండి: ఛీ! యాక్‌!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా..

2020లో కోవిడ్‌ మహమ్మారి కారణంగా క్షయ వ్యాధికి చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. మహమ్మారి మూలంగా అనేక మంది రోగులు కనీసం వ్యాధి నిర్ధారణకు కూడా నోచుకోలేదు. గణాంకాల ప్రకారం 2019లో 7.1 కోట్ల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2020లో ఆ సంఖ్య 5.8 కోట్లకు పడిపోయింది. 

అందుకు బారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. గత యేడాది మనదేశంతో సహా దాదాపుగా 30 దేశాల్లో సమారు కోటిన్నర మంది (2,14,000 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులతో కలిపి) క్షయతో మరణించారని డబ్యూహెచ్‌వో తన నివేదికలో తెలియజేసింది. ఐతే 2021-22లో టీబీ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడం, చికిత్స అందించడంలోని సవాళ్లను అధిగమిస్తే దీనినుంచి బయటపడొచ్చని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధపడేవారికి కోవిడ్‌ సమయంలో చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. దాని పర్యవసానమే ఈ మృత్యుఘోష!!

చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు