ఆల్కహాల్‌ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?

5 Oct, 2023 12:59 IST|Sakshi

మోతాదుకు మించి ఆల్కహాల్‌ తాగితే చనిపోతారా?..అంటే పలు ఉదంతాల్లో అది నిజమనే ప్రూవ్‌ అయ్యింది కూడా. ఎందువల్ల ఇలా జరుగుతుంది?. ఒక్కసారిగా అది మన శరీరానికి హని కలిగించే విషంలా ఎలా మారుతోంది తదితారాల గురించే ఈ కథనం.

ఈ ఆల్కహాల్‌కి చెందిన ఛాలెంజింగ్‌లను తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే చైనాలో ఓ వ్యక్తి రెండు లక్షలు గెలుచుకోవడం కోసం ఆఫీస్‌ పార్టీలో ఏకంగా ఒక లీటరు ఆల్కహాల్‌ని కేవలం పది నిమిష్లాల్లో హాంఫట్‌ చేశాడు. ఇక అంతే కాసేపటికే ప్రాణం పోయింది. ఆ వ్యక్తి పేరు జాంగ్‌. ఆస్ప్రతికి తరలించగా గుండెపోటు, ఆస్పిరేషన్‌ న్యూమోనియా తదతరాలతో బాధపడుతున్నట్లు తేలింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఆల్కహాల్‌ తాగేంతవరకు బాగానే ఉన్న వ్యక్తి వెంటనే ఎలా పాయిజన్‌ అయ్యి ప్రాణాంతకంగా మారింది...?.

తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కహాల్‌ తాగితే..
ఓ వ్యక్తి ఛాలెంజ్‌ పరంగా, లేదా ఏ కారణం చేతనైనా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ తాగితే అది ఒక్కసారిగా పాయిజన్‌గా మారిపోతుంది. అమాంతం రక్తంలో ఆల్కహాల్‌ స్థాయిలు పెంచేందుకు దారితీస్తుంది. రక్తంలో ఎప్పుడైతే ఆల్కహాల్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటాయో..అప్పుడూ కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేయలేక ఇబ్బంది పడుతుంది. రక్తప్రవాహంలో అదనపు ఆల్కహాల్‌ సాధారణ పనితీరును దెబ్బతీసి శ్వాస, హృదయస్పందన రేటు, రక్తపోటు పడిపోయేలా చేస్తుంది. దీంతోపాటు శరీర విధులను నియంత్రించే మెదుడలోని భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో ఆల్కహాల్‌ పెరుగుతూనే ఉన్నందున అతడు బతికే అవకాశాలు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గిపోతుంది. 

సంకేతాలు లక్షణాలు..

  • ఆల్కహాల్‌తో ఇలాంటి ఛాలెంజ్‌లు ప్రమాదకరమైనవి. అత్యవసరంగా చికిత్స అందించకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 
  • ఆ వ్యక్తులు ప్రమాదకరంలో ఉన్నారని ఎలా గుర్తించాలంటే.. వారి గోళ్లు, పెదవులు నీలం రంగులో మారి తేమగా లేదా చల్లగా అవుతున్నా..
  • నడవలేకపోతున్నా
  • హృదయస్పందన సరిగా లేకపోయినా
  • మూత్రశయం లేదా ప్రేగు నియంత్రణ కదలికలను నియంత్రించడం 
  • వాంతులు లేదా ఉక్కిరిబిక్కిరి

చికిత్స!

  • నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి.  తక్షణమే ప్రాణాలను రక్షించేలా చికిత్స అందించాలి. 
  • నిర్జలీకరణానికి ఇంట్రావీనస్ ద్రవాలు ఇస్తారు. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతారు
  • అలాగే ఆల్కహాల్‌ పాయిజనింగ్‌తో బాధపడుతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి కాన్యులాను ఉపయోగించి వారికి ఆక్సిజన్‌ని అందించడం చికిత్సలో అత్యంత ముఖ్యం
  • పొట్టని ఒక పంపు సాయంతో టాక్సిన్‌లు లేకుండా శుభ్రం చేయడం
  • రక్తంలోఇన ఆల్కహాల్‌ స్థాయిలను తగ్గించేలా రక్తాన్ని ఫిల్టర్‌ చేసేందుకు డయాలసిస్‌ చేయడం చేసి. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడతారు వైద్యులు.

(చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..)

మరిన్ని వార్తలు