హిజాబ్‌ తప్ప దేశంలో సమస్యలే లేవా?

1 Mar, 2022 01:40 IST|Sakshi

సందర్భం

ఉత్తర భారతంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం భారతీయ జనతాపార్టీ కర్ణా టకలో హిజాబ్‌ చిచ్చు రాజేసింది. ఎన్ని కలు జరిగే రాష్ట్రాల్లో నేరుగా మంట రాజేస్తే బాగుండదనీ, దక్షిణాదిలో తమ ఏలుబడిలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణా టకలో పొగబెడితే అది ఎలాగూ దేశ మంతా విస్తరించి తమకు మేలు జరుగు తుందనీ బీజేపీ పథకం వేసింది. ఒక దెబ్బకు రెండు పిట్టల న్నట్లు... బీజేపీ దీనిద్వారా రెండు ప్రయోజనాలు సాధించ దలచింది. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడం ఒకటైతే, బడుగు బలహీన వర్గాల పిల్లలను చదువుకు దూరం చేయడం రెండవది. 

నిజానికి ఇప్పుడు అందరూ భావిస్తున్నట్లు హిజాబ్‌  సంప్ర దాయం కేవలం, ముస్లింలతోనే ముడిపడి లేదు. అంతకంటే శతాబ్దాల ముందు నుంచే వేరువేరు రూపాల్లో ఇది ప్రపంచంలో ఉంది. ప్రాచీన గ్రీక్, ౖ»ñ జాంటైన్‌ నాగరికతల్లోనూ ఇది ఉనికిలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం ఇప్పటికీ ముస్లిమేతరుల్లో కొనసాగుతూనే ఉంది. భర్తకు, ఇంట్లోని కొంతమంది పురుషులకు తప్ప, బయటి పురుషులకు ముఖం, వెంట్రుకలు, ఇతర భాగాలు కనిపించ కూడదనేదే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ఒక సమూహానికి చిహ్నంగా మాత్రమే స్థిరపడిపోయింది. పరదా వేసుకున్న మహిళలపై వేధింపులు ఉండవనే ఉద్దేశంతో కూడా చాలామంది దీన్ని పాటిస్తారు, పాటిస్తున్నారు కూడా! ఖురాన్‌ గ్రంథంలో పరదా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నూర్‌ సూరా, అహెజాబ్‌ సూరాల్లో పరదాకు సంబంధించి అనేక విషయాలు చర్చించబడ్డాయి. గోప్యంగా ఉంచదగిన శరీర భాగాలను గోప్యం గానే ఉంచాలనీ, దానికోసం తల, మెడ, వక్షభాగం వస్త్రంతో కప్పుకోవాలనీ ధర్మం చెబుతోంది. ముస్లింలు పాటిస్తున్న పరదా సంప్రదాయం వల్ల నేటిదాకా ఎవరికీ ఇబ్బంది కలిగింది లేదు. అందులో ఇతరులు జోక్యం చేసుకునే అవసరం ఎంతమాత్రం లేదు. 

కానీ దేశంలో ఏ సమస్యలూ లేనట్లు, హిజాబ్‌ ఒక్కటే ఇప్పుడు సమస్య అయినట్లు దాన్నొక వివాదంగా మార్చి తమాషా చేస్తున్నారు కొందరు. ఇప్పుడు దేశంలో సమస్య హిజాబ్‌ కాదు. అందరికీ నాణ్యమైన విద్య కావాలి. వైద్యం కావాలి. ఉపాధి కావాలి. ఉద్యోగాలు కావాలి. జీవికకు భద్రత కావాలి. ప్రాణాలకు రక్షణ కావాలి. బేటీ పఢావో... బేటీ బచావో అని; సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ అనీ చేసిన వాగ్దానాల నుండి ప్రజల దృష్టి మరల్చి, ప్రభుత్వ పాఠశాలల్లో అంతంత మాత్రమైనా చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల పిల్లలను విద్యకు దూరం చేసి, ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలనీ; అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకోవా లనీ పాలక పక్షం హిజా బ్‌ను తెరపైకి తెచ్చింది. స్వప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిణామాలను భావి తరాలు ఎంతమాత్రం క్షమించవు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మనందరి బాధ్యత.

వ్యాసకర్త: ఎండి. ఉస్మాన్‌ ఖాన్‌ 
 సీనియర్‌ జర్నలిస్ట్‌

>
మరిన్ని వార్తలు