లయ తప్పిన రిట్రీట్‌ ధ్వని

8 Feb, 2023 01:15 IST|Sakshi

గణతంత్ర దినోత్సవ ముగింపులో చేసే ‘బీటింగ్‌ రిట్రీట్‌ మార్చ్‌’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్‌ రిట్రీట్‌ భావనను మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్‌ వారు రూపొందించిందే. బీటింగ్‌ రిట్రీట్‌కి ఉన్న బ్రిటిష్‌ మూలం కారణంగా అది మనకు చీకాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. అయితే ఎప్పటికీ ఈ ప్రాధాన్యం ఉంటుందా?

మీరు ఎంత ముసలివాళ్లయితే, అంత ఎక్కు వగా గతాన్ని పట్టుకుని వేళ్లాడతారని చెబు తుంటారు. అది తప్పకుండా నిజమేనని నేను తలుస్తున్నాను. గత వారం గణతంత్ర దినోత్సవ ముగింపు వేళ జరిపే ‘బీటింగ్‌ రిట్రీట్‌’పై నా చికాకుతో కూడిన స్పందనకు ఇది ఒక విశ్వస నీయ వివరణలా కనిపిస్తుంది. నేను దాన్ని ఇష్టపడలేదు. కానీ నేను ఈ విషయాన్ని తర్వాత పేర్కొంటాను. ఓ వారం క్రితం నేను చూసిన ఆ కార్యక్రమం నేపథ్యం గురించి మొదట నన్ను వివరించనీయండి. నేను దానిపై ఇలా అనుభూతి చెందుతున్నాను.

బీటింగ్‌ రిట్రీట్‌ ఒక మిలిటరీ వేడుక. బహుశా రెండవ జేమ్స్‌ ఇంగ్లండ్‌ రాజుగా ఉన్నప్పుడు 17వ శతాబ్దంలో ఇది ప్రారంభమైంది. ఒక రాత్రిపూట సైనిక దళాలు తిరోగమిస్తున్నప్పుడు యుద్ధ ముగింపు నకు సంకేతంగా బీటింగ్‌ రిట్రీట్‌ని మొదలెట్టారు. 1950లలో భారత  దేశం కూడా రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు సంబంధించి మూడురోజుల ముగింపు సందర్భంగా ఈ భావనను బ్రిటిష్‌ సంప్రదాయం నుంచి అరువు తెచ్చుకుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంగ్లిష్‌ కవాతుల నుంచి భారతీయులే స్వయంగా స్వరపర్చడం వరకు ‘బీటింగ్‌ రిట్రీట్‌ మార్చ్‌’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్‌ రిట్రీట్‌ భావ నను మాత్రం మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. నిజానికి దాన్ని మనం ఆదరిస్తూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. పైగా గుర్తుంచుకోండి. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్‌ వారు రూపొందించిందే. బీటింగ్‌ రిట్రీట్‌కి ఉన్న బ్రిటిష్‌ మూలం కారణంగా అది మనకు చికాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీటింగ్‌ రిట్రీట్‌కే నేను ఎల్ల ప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాను. నిస్సందేహంగా, సైనికుల కవాతు కచ్చితత్వం చూసి ఆశ్చర్యపడుతుంటాను. భూమ్యాకర్షణ శక్తిని సైతం డేర్‌ డెవిల్స్‌ ధిక్కరించడాన్ని చూస్తూ ఆశ్చర్య చకితుడినవుతుంటాను. నేను దాన్ని తోసిపుచ్చలేను. కానీ రిట్రీట్‌ సంగీతం; నార్త్, సౌత్‌ బ్లాక్‌ వెనుక నిలిపి ఉంచిన బ్యాండ్‌ల వర్ణరంజితమైన యూనిఫాంలు, రక్షణ గోడ వద్ద ఉన్న ఒంటెలు, చివరగా దిగంతాల వద్ద సూర్యుడు అస్తమించే సమయం ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతుంటుంది. నా జ్ఞాపకాల్లో ఎన్నటికీ నిలిచి ఉండిపోయింది ఏమిటంటే రైసినా హిల్స్‌ని అధిరోహిస్తూ, ‘సారే జహాసే అచ్ఛా... హిందూ సితా హమార హమారా’ అని ఆలపిస్తూ ఉండే రిట్రీటింగ్‌ బ్యాండ్లు. వారు శిఖరాన్ని సమీపిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించడం ప్రారంభమవుతుంది. వెంటనే లెక్కలేనన్ని పసుపు పచ్చ దీపాలు మొత్తం విస్టాను ప్రకాశవంతం చేసేవి. ఇది ప్రతి ఒక్కరినీ ఆనందంలో ముంచెత్తేది. నేటి పద  జాలాన్ని ఉపయోగించి చెప్పాలంటే... అదొక విస్మయం కలిగించే క్షణం.

అయ్యో... అది చాలావరకు ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇక అది జరగని పని. ప్రారంభ ప్రయత్నంగా మార్పు చేసిన సంగీతం భయానకమైనది కాకున్నా, కఠోరంగా ఉంటోంది. భార తీయ లేదా బ్రిటిష్‌ మూలానికి చెందినవైనా సరే పాదతాడనంతో చేసే సైనిక కవాతుల సంగీతం ఇకపై వినిపించదు. దీని స్థానంలో రాగాలు వచ్చి చేరాయి. సైనిక వేడుకల్లో వాటికి తావులేదు. వీటిని ఇంట్లో లేదా కాన్సర్ట్‌ హాల్‌లో అయితే బాగా ఆస్వాదించవచ్చు. విజయ్‌ చౌక్‌లో సైనిక బ్యాండ్లు ఆలపించేవి కాదు. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం ఆలపించిన బీటింగ్‌ రిట్రీట్‌ రాగం (ఇది సరైన పదమే అయితే) ఏమాత్రం లయబద్ధంగా లేదు. మాధుర్యంతోనూ లేదు. దీంట్లో సంగీతం కంటే రొద మాత్రమే ఎక్కువగా ఉండింది. అది నరకద్వారంలో ఎవరైనా ఊహించే రొదలా ఉండింది కానీ స్వర్గ లోకపు ద్వారాల వద్ద వినిపించే సంగీతంలా లేదు. ఈ ఒక్క మార్పు దాని అర్థాన్ని మాత్రమే కాదు, బీటింగ్‌ రిట్రీట్‌ తక్షణ సారాన్నే ధ్వంసం చేసిపడేసింది. అయినా సరే ఎవరైనా దీన్ని పరిగణిస్తారా? దీనిలోని ఇతర అంశాలు కూడా అదృశ్యమైపోయాయి. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న గంటల నుంచి వినిపించే దాని శ్రావ్యమైన మాధుర్యం కూడా పరిత్యజించబడింది. భవనాలను వెలిగించే లక్ష లాది పసుపుపచ్చ బల్బుల స్థానంలో బహుళరంగులు గోడలపై ప్రదర్శితమవుతున్నాయి. అంతకు ముందున్నవి ధ్వనింపజేసే ఆశ్చర్యం, ఆనందం స్థానంలో ఇప్పుడు ఒక యాంటీ క్లైమేట్‌ని తలపించే నీరస మైన అసంతృప్తి చోటు చేసుకుంది.

బీటింగ్‌ రిట్రీట్‌లోని ఆనాటి మ్యాజిక్‌ కనుమరుగైనట్లు కనిపిస్తోంది. ఒక సాధారణమైన, ఉత్తేజపూరితం కానిది మాత్రమే మనకు ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు బీటింగ్‌ రిట్రీట్‌కి చెందిన అద్భుతం కానీ, మనోహర దృశ్యం కానీ ఇప్పుడు లేవు. మనకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. కాలంతోపాటు అవి కనుమరుగైపోతాయి. గత వారం రిట్రీట్‌ సందర్భంగా వర్షం కురిసినప్పుడు, దేవుళ్లు సైతం విలపిస్తున్నట్లుగా నేను అనుభూతి చెందాను. అది తగిన స్పందనలాగే కనిపించింది. ప్రపంచం మారుతోందనీ, ఆ మార్పు వెనకాలే నేను మిగిలిపోయాననీ గుర్తించాను. అందుకే నేను విషాదంతో ఉన్నాను. అందుకే నేను ఇంత ప్రతికూల దృక్పథంతో ఉంటుండవచ్చు. చివ రగా, నేను ముందుకేసి చూస్తున్నప్పుడు, నా మనస్సును రెండు ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఇక్కడ చుట్టుముట్టడం అనేది సరైన పదం. ఎందుకంటే వాటికి నేను సమాధానం చెప్పలేను మరి. సారే జహా సే అచ్ఛా పాట పాడి ఎంతకాలమైంది! కచ్చితంగా దాని మూలాలే ఆ పాటను అనుమానించేలా చేశాయా? అలాగయితే బీటింగ్‌ రిట్రీట్‌ ఎప్పుడు ముగిసిపోతుంది? ఏమైనా దాని వలసవాద చరిత్రను మీరు తోసిపుచ్చలేరు కదా. పైగా అది ఆత్మనిర్భర్‌ కాదు కూడా మరి.


కరణ్‌ థాపర్‌ ,వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు