వివాలో ఘనంగా బాలల దినోత్సవం

15 Nov, 2023 00:54 IST|Sakshi
విద్యార్థులతో చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, ఉపాధ్యాయులు

పెదకాకాని: వివా ది స్కూల్‌లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నంబూరు వివా స్కూల్‌లో బాలల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో రిలే రేన్‌, బ్యాక్‌ వాకింగ్‌, ఫ్రాగ్‌ జంప్‌ వంటి పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన తికమకల బండి సందేశాత్మక హాస్యనాటిక ఆకట్టుకుంది. ఉపాధ్యాయులు ప్రదర్శించిన సంగీత, నృత్య ప్రదర్శనలు అలరించాయి. స్కూల్‌ చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, డైరెక్టర్‌ ఎల్‌టీ కమాండర్‌ కె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ సరళాదేవి, పీవైపీ హెడ్‌ కె.మాధవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు