-->

వనదేవతల కానుకల లెక్కింపు

29 Mar, 2024 02:00 IST|Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ హుండీల్లోని కానుకలను గురువారం లెక్కించారు. మేడారం ఎండోమెంట్‌ డార్మెటరీ హాల్‌లో పూజారుల సమక్షంలో దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కానుకలు లెక్కించారు. 10 హుండీల కానుకల ద్వారా రూ.43,12,977 ఆదాయం వచ్చినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ. 22,36,564, సారలమ్మ హుండీ రూ. 18,67,016, గోవిందరాజు హుండీ రూ.1,17,761, పగిడిద్దరాజు హుండీ ఆదాయం రూ. 91,636 వచ్చినట్లు ఈఓ తెలిపారు. ఈ నగదును తాడ్వాయి మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్‌లో జమ చేసినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన మునీందర్‌, చంద రఘుపతిరావు, కొక్కెర క్రిష్ణయ్య, కాక కిరణ్‌, సిద్ధబోయిన అరుణ్‌, ఎండోమెంట్‌ సూపరిటెండెంట్‌ క్రాంతికుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్లు జగదీశ్వర్‌, మధు, రమాదేవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో

జేఏ ఆత్మహత్య

కాశిబుగ్గ: ఆర్థిక ఇబ్బందులతో జూనియర్‌ అసిస్టెంట్‌(జేఏ) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘ టన గురువారం వరంగల్‌, చింతలపల్లి రైల్వేస్టేషన్ల ఽమధ్య ధర్మారం వద్ద చోటు చేసుకుంది. జీఆర్పీ సీఐ నరేష్‌ కథనం ప్రకారం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన రావుల రవి(57) జనగామ పంచాయతీరాజ్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రవికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు చేయడంతో అప్పుల పాలయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది బుధవా రం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి గు రువారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్‌ఎస్‌ ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌ కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుమారుడు కేశవ వర్మకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers