మౌలిక సదుపాయాలు కల్పించాలి | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాలు కల్పించాలి

Published Tue, Apr 9 2024 1:00 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రావీణ్య - Sakshi

వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య

కరీమాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాలని వరంగల్‌ కలెక్టర్‌ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పాఠశాలల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కమి టీల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసి త్వరగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి సెలవులు ముగిసి విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అన్ని పనులు పూర్తి కావాలన్నారు. కమిటీల ఆధ్వర్యంలో రూ.25వేల లోపు ఖర్చయ్యే పనులు మే 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలోనే పోలింగ్‌ కేంద్రాలున్న పాఠశాలల్లో విద్యుత్‌, నీరు, మరుగుదొడ్లు 15రోజుల్లో పూర్తి చేయాలన్నారు. డీఈఓ వాసంతి, డీఆర్‌డీఓ కౌసల్యదేవి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ హవేలి రాజు, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఎంఈఓలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement