ఉగాది ఉషస్సులు.. | Sakshi
Sakshi News home page

ఉగాది ఉషస్సులు..

Published Tue, Apr 9 2024 1:00 AM

- - Sakshi

శ్రీక్రోధి నామ సంవత్సర సందడి..

వేపచెట్లు అమృతాన్ని నింపుకున్న పూలతో ప్రకాశిస్తుండగా.. మామిడి చెట్లు లేలేత పిందెలతో మానవ కల్యాణానికి మంగళగీతాలు పాడుతుండగా.. మోదుగచెట్లు నిప్పు కణికలాంటి పూలతో శోభాయమానం చేస్తుండే రమణీయమైన సొగసుల కాలమే వసంతమే. చైత్ర శుక్ల పాడ్యమి రోజున జరుపుకునే తెలుగువారి తొలి పండుగ ఉగాది. శ్రీక్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వరంగల్‌ నగరవాసులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉగాదిని పురస్కరించుకుని నగరంలోని పలు కూడళ్లలో సందడి నెలకొంది. ఉగాది పచ్చడికి అవసరమైన కొత్తకుండలు, చింతపండు, మామిడాకులు, మామిడికాయలు, వేపపూవు కొనుగోలు చేశారు. పండుగ రోజు పంచాంగ శ్రవణానికి ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి.

– హన్మకొండ కల్చరల్‌

– వివరాలు 8లోu

Advertisement
Advertisement