ఎడారిలో స్మార్ట్‌ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్‌ టాక్సీలు, ఎలివేటర్‌,

15 Jul, 2022 20:34 IST|Sakshi

ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్‌ ఛానల్స్‌లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే  ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్‌ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.

వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్‌ను  చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.  ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్‌ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్‌ సిటీని రూపొందిస్తుంది.

సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్‌లు, అర్బన్ స్పేస్‌పోర్ట్,  డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్‌(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్‌ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్‌ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.

(చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్‌)

మరిన్ని వార్తలు