77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్‌! అయినా ఐస్‌ స్కేటింగ్‌ చేశాడు!!

13 Dec, 2021 14:38 IST|Sakshi

77 year Old  Astrophysicist Battling Stage 4 Prostate Nails Ice Skating: మనషి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా చివరి దశ వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆచరణ వరకు వస్తే అంతగా ఎవరూ పూర్తి స్థాయిలో చేయడానికి ఆసక్తి చూపరనే చెప్పాలి. ఏదో ఒక కారణంతో మన కలలను, లక్ష్యాలను వదిలేసి మనం ఇంతవరకే సాధించగలం అని సరిపెట్టేసుకుంటారు. కానీ ఇక్కడొక వృద్ధుడు మరణానికి దగ్గరలో ఉన్నా కూడా ఐస్‌ స్కేటింగ్‌ చేయాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు.

అసలు విషయంలోకెళ్లితే...రిచర్డ్ ఎప్‌స్టీన్‌ అనే 77 ఏళ్ల వృద్ధుడు రెండేళ్లకు పైగా క్రానిక్ లింఫాటిక్ లుకేమియా (సిఎల్‌ఎల్)తో పోరాడి బయట పడిన తర్వాత మళ్లీ 2020లో స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్‌ భారిన పడతాడు. అయితే అవేమి ఆ వృద్ధడు పెద్దగా పట్టించకోడు. పైగా ఐస్‌ స్కేటింట్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు దీని కోసం ఒక స్కేటింగ్‌ టీచర్‌ వద్ద ట్రైయినింగ్‌ కూడా తీసుకుంటాడు.

ఈ మేరకు అతని కూతురు మహిళ రెబెకా బాస్టియన్ తన తండ్రి  విజయవంతంగా ఐస్‌ స్కేటింగ్‌ నేర్చుకోవడమే కాక  గురువుతో కలిసి స్కేటింగ్‌ చేస్తున్న వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తుంది. అంతేకాదు తన తండ్రి ఖగోళ శాస్త్రవేత్త అని మౌంట్ రైనర్‌ను అధిరోహించిన సాహసి అని కూడా వెల్లడిస్తుంది. పైగా నేర్చకునే వయసు అయిపోయింది, నా పరిస్థితి ఏం బాగోలేదు అని కూర్చోకూడదని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని ఆస్వాదించాలంటూ ట్విట్టర్‌లో పేర్కొంటుంది. అయితే ప్రసుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

మరిన్ని వార్తలు