అమెరికా: అధ్యక్షుడు బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన వ్యక్తి

18 Dec, 2023 09:17 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో కలక​లం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రెసిడెంట్‌ సురక్షితంగా ఉన్నట్లు  అధికారులుప్రకటించారు.

అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వైఫల్య ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. వైట్‌హౌజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బైడెన్‌ దంపతులు ఆదివారం రాత్రి డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి  యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొంది.

అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు కారు నడిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు