‘చైనా, పాక్‌ రహస్య ఒప్పందాలు’

25 Jul, 2020 16:22 IST|Sakshi

న్యూఢల్లీ: చైనా, పాకిస్తాన్‌ దేశాలు రహస్య బయోవార్‌(జీవ, రసయనక) ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ క్లాన్‌ అనే జర్నలిస్ట్‌ సంచలన కథనంతో విశ్లేషించారు. అయితే వూహాన్‌లో కరోనాను గుర్తించిన నేపథ్యంలో చైనా సరియైన సమాచారం ఇవ్వలేదని ప్రపంచ వ్యాప్తంగా చైనాపై అనుమానాలు మొదలయ్యాయి. క్లాన్‌ వెల్లడించిన కథనంలో వూహాన్‌(చైనా)ల్యాబ్‌, పాకిస్తాన్‌ సంయుక్తంగా ఆంత్రాక్స్‌ (బ్యాక్టీరియా) లాంటి పాథోజెన్స్‌(వ్యాధి కారకం)ను సృష్టించబోతున్నాయని ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌ తెలిపారు.

మరోవైపు బయో రీసెర్చ్‌ను పాక్‌లో రహస్యంగా పరిశోధించడానికి, చైనా ఆర్థికంగా సహకరిస్తుందని తెలిపారు. కాగా సమాజానికి మాత్రం అంటువ్యాధుల పరిశోధన అంటూ చైనా, పాక్‌ చెప్పబోతున్నట్లు తెలిపారు. అయితే వూహాన్‌ ల్యాబ్‌ నిపుణులు పాక్‌ శాస్త్రవేత్తలకు వైరస్‌ను ఎలా సృష్టించాలో శిక్షణ ఇవ్వనున్నారని ఆంథోనీ క్లాన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు