ఐ ఫోన్ పిచ్చితో కిడ్నీ అమ్మాడు, కానీ ఏకంగా..

17 Nov, 2020 20:37 IST|Sakshi

ఆపిల్ ఫోన్ కొనాల‌న్న‌ది మిడిల్ క్లాస్‌కు నెర‌వేర‌ని క‌ల‌. ఆపిల్‌ కొత్త మోడ‌ల్‌ రిలీజ్ అయిన‌‌ప్పుడ‌ల్లా  కిడ్నీ అమ్మైనా స‌రే ఆ ఫోన్ కొనాల‌ని చాలా మంది జ‌నాలు సోష‌ల్ మీడియాలో జోకులు పేలుస్తుంటారు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం నిజంగానే కిడ్నీ అమ్మి ఐ ఫోన్ కొన్నాడు. ఫ‌లితంగా ఇప్పుడు మంచాన ప‌డి మూల్యం చెల్లించుకుంటున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల‌ వాంగ్ షాంగ్‌క‌న్‌కు ఆపిల్ ఫోన్ కొనాల‌ని పిచ్చి. కానీ త‌న ద‌గ్గ‌ర అంత మొత్తంలో డ‌బ్బు లేక‌పోవ‌డంతో మూత్ర‌పిండాన్ని అమ్మేయాల‌నుకున్నాడు. అనుకున్న‌ట్లుగానే బ్లాక్ మార్కెట్‌లో కుడివైపు కిడ్నీని అమ్మేశాడు. (చ‌ద‌వండి: 'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..)

వ‌చ్చిన సొమ్ముతో ఆపిల్ ఐపాడ్‌, ఐ ఫోన్ 4 కొన్నాడు. 2011లో జ‌రిగిందీ ఘ‌ట‌న‌. కానీ కొంత‌కాలానికే అత‌ని మ‌రో కిడ్నీకి స‌మ‌స్య ఏర్ప‌డింది. ఇప్పుడ‌ది పెద్ద‌ద‌వ‌డంతో అత‌డి స్థితి మ‌రింత దీనంగా త‌యారైంది. అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌ని చేయక‌పోవ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యాడు. అత‌డికి త‌ర‌చూ డ‌యాల‌సిస్ చేస్తున్నారు. ఇక‌ జీవితాంతం అత‌డు బెడ్‌కే ప‌రిమితం కావాల‌ని వైద్యులు చెప్పారు. కాగా బ్లాక్ మార్కెట్‌లో కిడ్నీ కొనుగోలు చేసిన‌ విష‌యంలో ఐదుగురు స‌ర్జ‌న్ల‌తో క‌లిపి తొమ్మిది మందిని పోలీసులు క‌ట‌క‌టాల వెన‌క్కు నెట్టారు. (చ‌ద‌వండి: వైరల్‌: కోతుల్ని తరిమి కొట్టండి: సీటు గెలవండి!)

మరిన్ని వార్తలు