మస్క్‌ చేతికి ట్విటర్‌.. రీఎంట్రీ ఉంటుందా అంటే? ట్రంప్‌ ఏమన్నారో చూడండి

26 Apr, 2022 18:09 IST|Sakshi

వాషింగ్టన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ను స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ చేజిక్కించుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ట్విటర్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకే మస్క్‌ దానిని కొనుగోలు చేశారని అన్నారు. ఎలన్‌ మస్క్ మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. అలాగే, ట్విట్టర్‌లోకి రీఎంట్రీపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ట్విటర్‌ తన అకౌంట్‌ను పునరుద్ధరించినా.. ఆ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలోకి తిరిగి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. 
చదవండి👉🏾 ట్విటర్‌ డీల్‌.. చైనా ప్రస్తావనతో పొగిడాడా? చరుకలు అంటించాడా?

సొంత సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్‌ సోషల్’‌లోనే కొనసాగుతానని చెప్పారు. మరోవారం రోజుల్లో లాంఛనంగా తన ట్రూత్‌ సోషల్‌లో జాయిన్‌ అవుతానని అన్నారు. 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఖాతాను ట్విట్టర్‌ నిషేధించింది. అప్పటికే ట్విట్టర్‌లో ట్రంప్‌కు 88మిలియన్ల ఫాలోవర్లున్నారు. కాగా, ఫ్రీ స్పీచ్ (వాక్ స్వాతంత్య్రానికి) కోసం ట్విట‌ర్‌ను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించిన మస్క్‌ ఎట్టకేలకు సాధించారు. దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు.
చదవండి👉🏻 కిండర్‌గార్టెన్‌లో కాల్పుల కలకలం.. నలుగురి మృతి

మరిన్ని వార్తలు