ఇలా చేస్తే పుతిన్‌ యుద్ధం ఆపుతాడు.. మాస్టర్‌ ప్లాన్‌ వేసిన ట్రంప్‌

13 Mar, 2022 16:07 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. దాడుల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రష్యాలు కఠిన ఆంక్షలు విధించాయి. పలు దేశాల ముఖ్య నేతలు సైతం పుతిన్‌ తీరును ఖండించారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా రష్యా దాడులను వ్యతిరేకిస్తూ.. ఉక్రెయిన్‌కు మద‍్దతుగా నిలిచారు. మరో వైపు ఉక్రెయిన్‌, రష్యా బృందాల మధ్య చర్చలు మాత్రం సఫలీకృతం కావడం లేదు.

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వార్తలు చేస్తూ వార్తల్లో నిలిచారు. దక్షిణ కరోలినాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో జో బైడెన్‌ బలహీనత, పిరికితనం వల్ల భారీ నష్టం జరుగుతోందన్నారు. కాగా, ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముగింపు పలికేందుకు అమెరికా సైన్యం రక్తం చిందకుండా ఇంకా అనేక మార్గాలున్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అలాగే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మధ‍్యవర్తిత‍్వం చేసేందుకు బైడెన్‌కు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. రెండు దేశాల మధ్య ఇలాంటి యుద్ధ వాతావరణమే కొనసాగితే మూడో ప్రపంచ యుద్దం తప్పదని ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగానే రష్యాకు ధీటుగా అమెరికా స్పందించాలన్నారు. రష్యా ఇంధన వనరులపై పశ్చిమ దేశాలు శాశ్వతంగా ఆధారపడకుండా చేయడం వల్ల కలిగే పరిణామాలను తెలియజేస్తూ మాస్కోను బెదిరించే ప్రయత్నం చేయాలన్నారు. కాగా, రష్యా ప్రపంచంలోని ప్రముఖ ఇంధన సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తిలో అమెరికా, సౌదీ అరేబియా తర్వాత మూడవ స్థానంలో రష్యా ఉంది.

ఇది చదవండి: బైడెన్‌కు బిగ్‌ షాక్‌.. అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్స్‌ దాడి

మరిన్ని వార్తలు