తింగరోడు.. లైవ్‌ టెలికాస్టింగ్‌లో ఫోన్‌ చోరీ! కట్‌ చేస్తే..

22 Oct, 2021 11:57 IST|Sakshi

​కైరో: ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా క్రేజ్‌ పెరిగిపోవడంతో లైవ్‌ ఈవెంట్‌లు కూడా వీటిద్వారానే ప్రసారం కావడంతో వార్తాప్రపంచం అనేది ప్రజలకు మరింత చేరువైంది.. ఇది కాలక్రమంలో టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పుగానే చెప్పవచ్చు. ఎక్కువ న్యూస్‌ టెలికాస్ట్‌ చేయాలన్న ఉద్దేశంతో చాలా సరికొత్త ఈవెంట్స్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అందలో భాగంగా ఈజిప్ట్‌లోని ఒక న్యూస్‌ చానల్‌ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుంటే ఒక విచిత్రం చోటు చేసుకుంది. 

(చదవండి: అందుకే ఇంగ్లండ్‌ నుంచి వస్తున్నారు)

 అసలేం జరింగిందంటే....ఈ జిప్ట్‌లోని యూమ్ 7 న్యూస్‌ చానల్‌  రియల్‌ టైమ్‌ ఈవెంట్‌ అనే సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత చేరవ కావడానికీ ప్రయత్నిస్తోంది. ఆ తరుణంలో కొన్ని భయంకరమైనవి, ఆసక్తి కలిగించే రియల్‌టైం ఈవెంట్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అయితే ఇటీవల ఈజిప్ట్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రియల్‌టైం ఈవెంట్‌లో భాగంగా భూకంపం తర్వాత ప్రజల పరిస్థితి ఎలా ఉంది అనే న్యూస్‌ని ఫోన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు అనూహ్యంగా ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

ఆ రోజు న్యూస్‌ చానల్‌ ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్షప్రసారంలో న్యూస్‌ని జర్నలిస్ట్‌ మహమూద్ రాఘేబ్ నివేదిస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగ అతని ఫోన్‌ కొట్టేశాడు. ఫోన్‌ను కొట్టేసిందే తడువు బైక్‌పై వేగంగా జారుకుంటాడు. ఆ ఫోన్‌ను చేతిలోనే ఉంచుకుని సిగరెట్‌ కాలుస్తూ బైక్‌ను దర్జాగా డ్రైవ్‌ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతాడు. కాగా, ఆ ఫోన్‌ కెమెరా రోలింగ్‌లోనే ఉందని విషయం దొంగ గ్రహించకపోవడంతో అది ప్రత్యక్ష ప్రసారంలోనే రికార్డు అయ్యింది. తనను ఎవరైనా ఫాలో చేస్తున్నారా అనే అనుమానంతో మధ్యమధ్యలో వెనక్కి చూసుకుంటూ ఉండటం లైవ్‌ చూసేవారికి నవ్వులు తెప్పించింది. ‘నీ వెనకాల ఎవరూ రావడం లేదు.. కానీ ప్రపంచం మొత్తం నీ దొంగతనం చూస్తుంది’ అని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ అవ్వడంతో ప్రజలు ఆ దొంగను పట్టుకోవటానికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని  అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి ఆ విషయం నన్ను బాధిస్తోంది)

మరిన్ని వార్తలు