జాకబ్‌ జుమాకు 15నెలల జైలు శిక్ష 

30 Jun, 2021 01:05 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా(79)కు ఆదేశ అత్యున్నత న్యాయస్థానం 15నెలల జైలు శిక్షను విధించింది. జుమా పదవీ కాలంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జరుగుతన్న విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారం కింద ఈ శిక్షను విధించింది. 2009–18 కాలంలో జుమా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తాజాగా కోర్టు ధిక్కార శిక్ష విధింపు సమయంలో సైతం జూమా కోర్టులో లేరు. ఏదైనా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు ఆయనకు కోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది. ఈ సమయంలో లొంగుబాటుకు రాకుంటే  అరెస్టుకు ఆదేశాలిస్తారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు