దారుణ అవమానాలు.. ఎక్కువ కాలం బతకను: మాజీ అధ్యక్షుడు

9 Nov, 2021 11:28 IST|Sakshi

జార్జియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

అరెస్ట్‌కు వ్యతిరేకంగా 39 రోజులుగా జైలులో నిరాహార దీక్ష

త్బిల్సి: ఎన్నికల్లో మోసానికి పాల్పడి.. విజయం సాధించారనే ఆరోపణల నేపథ్యంలో జార్జియా అధ్యక్షుడు సాకాష్విలిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొంది. జైలులో ఉన్న సాకాష్విలి.. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 39 రోజులుగా ఆయన ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా సాకాష్విలి జైలు సిబ్బందిపై సంచనల ఆరోపణలు చేశారు. జైలులో తనను తిడుతున్నారు.. కొడుతున్నారని.. త్వరలోనే చనిపోతానేమో అని భయమేస్తుంది అన్నారు. సాకాష్విలి 2004-2013 వరకు జార్జియా అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్నికల్లో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. 

ఈ సందర్భంగా సాకాష్విలి మాట్లాడుతూ.. ‘‘జైలు సిబ్బంది నన్ను బూతులు తిట్టారు.. నా మెడ మీద కొట్టారు.. జుట్టు పట్టుకుని నేల మీద పడేసి లాక్కెళ్లారు. ఇలానే కొసాగితే.. త్వరలోనే నేను చనిపోతానని భయమేస్తుంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. జైలులో తన పరిస్థితిని వివరిస్తూ.. తన లాయర్‌కు లేఖ రాశాడు. అంతేకాక అనారోగ్యంగా ఉన్న తనను జైలు ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ తనను చంపడమే వారి లక్ష్యమని సాకాష్విలి పేర్కొన్నాడు.
(చదవండి: 400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు )

ప్రస్తుతం ఈ  లేఖ జార్జియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హక్కుల కార్యకర్తలు జైలు బయట కూర్చొని అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 40 వేల మంది కార్యకర్తలు నిరసలో పాల్గొని.. సాకాష్విలికి మద్దతు తెలిపారు. ఆయనను విడుదల చేయాల్సిందిగా కోరారు.

సోమవారం ఉదయం, సాకాష్విలిని పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో అనేక అవయవాలు పని తీరు ఇప్పటికే నెమ్మదించిందని.. నిరాహాదర దీక్ష మరి కొంత కాలం కొనసాగితే.. ఆయన ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రస్తుతం సాకాష్విలికి అత్యవసరంగా హైటెక్ క్లినిక్‌లో చికిత్స చేయవలసిన అవసరం ఉందని చెప్పారు.
(చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్‌ అయిన స్కూల్ విద్యార్థి?)

సాకాష్విలికి అంతర్లీన రక్త రుగ్మత ఉన్నందున అతని నిరాహారదీక్ష ముఖ్యంగా ప్రమాదకరమైనదిగా మారినందున అతనికి మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. సాకాష్విలిని జైలు ఆసుపత్రికి తరలించడాన్ని ఉక్రెయిన్ నిరసించింది, ఈ చర్య "అదనపు నష్టాలను సృష్టిస్తుంది" అని పేర్కొంది.

చదవండి: ఆక్సిజన్‌ ఉండేది 100 కోట్ల ఏళ్లే..

మరిన్ని వార్తలు