అంతరిక్షంలో కాఫీ ఎలా తాగుతారు?

4 Oct, 2023 08:49 IST|Sakshi

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)లో అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వ్యోమగాములు  వేడివేడి కాఫీని ఎలా తాగుతారో చూపించారు.

వీడియోలో క్రిస్టోఫోరెట్టి ఒక ప్యాకెట్‌లోని కాఫీని ఒకచిన్న బాటిల్‌లో పోయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు. అయితే గురుత్వాకర్షణలేమి కారణంగా కాఫీ బయటకు రాదు. ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా రూపొందించిన ‘స్పేస్ కప్‌’ను బయటకు తీసి, అందులో కాఫీ పోస్తారు. దీంతో ఆమె హాయిగా  కాఫీ తాగగలుగుతారు. 2,85,000కు మించిన వీక్షణలు, 2 వేలకు పైగా లైక్‌లను అందుకున్న ఈ వీడియో అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను తెలియజేస్తుంది. 

‘స్పేస్ కప్’ వ్యోమగాములకు  ఎంతో ఉపయోగపడుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోగ్రావిటీ కప్పులు అంతరిక్షంలో ద్రవపదార్థాలను తాగేందుకు రూపొందించారు. స్పేస్ కప్ అనేది ద్రవాన్ని నిష్క్రియాత్మకంగా కప్పు పైభాగానికి చేరవేస్తుంది. దీని రూపకల్పనకు పరిశోధకులు ఉపరితల ఉద్రిక్తత, చెమ్మగిల్లే పరిస్థితులు,కప్పు నిర్దిష్ట జ్యామితి మొదలైనవాటిని పరిశీలిస్తారు. ప్రక్రియను చూసేందుకు కప్పును పారదర్శకంగా రూపొందిస్తారు.
ఇది కూడా చదవండి: చైనా ‘జియాన్-6’తో భారత్‌పై నిఘా పెట్టిందా?
 

మరిన్ని వార్తలు