భారత్‌తో సైనిక సంబంధాలకు ఢోకా లేదు: కెనడా సైనికాధికారి

26 Sep, 2023 18:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కెనడా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొంత మేర  దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న మాట వాస్తవమే కానీ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలకు మాత్రం ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్. 

అది రాజకీయ సమస్య.. 
భారత్ వేదికగా జరుగుతున్న ఇండో పసిఫిక్ సైన్యాధ్యక్షుల సదస్సులో పాల్గొనేందుకు 30 దేశాల సైన్యానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కెనడా డిప్యూటీ ఆర్మీ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. పీటర్ స్కాట్ మాట్లాడుతూ.. భారత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని.. కెనడా భారత్ మధ్య జరుగుతున్న వివాదానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నాకు తెలిసినంతవరకు ఆ సమస్య రాజకీయ స్థాయిలోనే పరిష్కారమవ్వాలని దానిలో మేము జోక్యం చేసుకోవడం లేదన్నారు.

ఇండో పసిఫిక్ దేశాల కోసం.. 
మా ప్రధాని ఆ విషయాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లోనే ప్రస్తావించారని దానిపై విచారణ కూడా కొనసాగుతోందని ఆయన కోరినట్లు భారత్ సహకరిస్తే విచారణ తొందరగా జరిగే అవకాశముంటుందన్నారు. ఇక ఆ సమస్య రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను ఏమాత్రం ప్రభావితం చేయదన్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో ముందురోజు మాట్లాడానని ఆ సమస్య రాజకీయ స్థాయిలోనే పరిష్కారం కావాలని దాని వలన సైనిక సంబంధాలకు ఎటువంటి భంగం కలగకూడదని ఇద్దరం తీర్మానించుకున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇండో-పసిఫిక్ దేశాలకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని. 

అన్ని వేళ్ళూ అటువైపే.. 
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్‌పై ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఆయన చేసిన ఆరోపణలను ఖండించిన విషయం తెలిసిందే. అత్యధిక ప్రపంచ దేశాలు కూడా కెనడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. ట్రూడో ఆరోపణలు నిరాధారమైనవని చెబుతూ ఉగ్రవాదానికి కెనడా కేంద్రంగా మారుతోందని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు అడ్డగా కెనడా: భారత్‌కు శ్రీలంక మద్దతు

మరిన్ని వార్తలు