గాజాకు భారత్‌ మానవతా సాయం!

22 Oct, 2023 16:04 IST|Sakshi

పాలస్తీనా మిలిటెంట్లు హమాస్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తెలిసిందే. ఈ భీకర యుద్ధంలో వేలాది మంది సాధారణ పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పాయారు. హమస్‌ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయల్‌ సైన్యం గాజాపై విధ్యంసకరంగా విరుచుపడింది. ఈ దాడులతో గాజా చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపథ్యంలో భారత్‌ నేడు గాజాలోని పాలస్తీనియన్లకు వైద్య సహాయం, విపత్తు సహాయ సామగ్రిని పంపింది. 

అంతేగాక యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్‌లు, శానిటరీ యుటిలిటీలు తదితరాల తోపాటు ఇతర అత్యవసర వస్తులు, నీటి శుద్దీకరణ మాత్రలు గాజాకు పంపిచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు ఈ దాడుల్లో దాదాపు 4,300 మంది పాలస్తనీయన్లు మరణించారని, ప్రధానంగా పౌరులే ఎక్కువుగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే వేలాదిమందికి పైగా ప్రజలు క్షతగ్రాతులుగా మారారని పేర్కొంది. ఇదిలా ఉండగా,  భారత ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో గాజాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ వారం ప్రారంభంలోనే చర్చించిన సంగతి తెలిసిందే. 

పైగా భారత్‌ పాలస్తీనియన్ల కోసం తన వంతుగా మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటుందని మోదీ పాలస్తీనా అధ్యక్షుడుకి హామీ కూడా ఇచ్చారు. ఈ ఘర్షణలో పౌరుల మరణాలే అధికంగా ఉండటం బాధకరం అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారు తప్పక దీనికి బాధ్యత వహించక తప్పదని ఫైర్‌ అయ్యారు. మరోవైపు ఈ జిప్టు శిఖరాగ్ర సమావేశంలో యూఎన్‌ చీఫ్‌ ఆంటోనియా గుటెర్రెస్‌ కూడా మానవతావాద దృక్పథంతో కాల్పులు విరమించాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం గాజాలో తాగునీరు, ఆహరం, పెట్రోలు వంటివి లేక తీరని మానవతా పరిస్థితితో అట్టుడుకుతోందన్నారు. గాజా పరిస్థితిని చక్కబడేలా ప్రపంచ దేశాలన్ని తమవంతుగా సాయం అందించేలా మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థ ప్రయత్నాలు ఫలితంగా ఇజ్రాయెల్‌ కూడా గాజాకు మానవతా సాయం అందించేందుకు అంగీకరించింది

(చదవండి: గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్‌)

మరిన్ని వార్తలు